https://oktelugu.com/

Bigg Boss Nataraj: కూతురే అమ్మగా… సంతోషంలో నటరాజ్ మాస్టర్ !

Bigg Boss Nataraj: బిగ్ బాస్ ఫేమ్ నటరాజ్ మాస్టర్ ఇంట్లో పండుగ నెలకొంది. ఆయన తండ్రిగా మారిన సంగతి తెలిసిందే. ఆయన భార్య నీతూ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్లో పాల్గొన్న నటరాజ్ మాస్టర్ వైఫ్ గర్భవతి అన్న విషయం తెల్సిందే. ఆయన హౌస్ లోకి వెళ్లే సమయానికి ఆమె నిండు గర్భంతో ఉన్నారు. ఇక నటరాజ్ హౌస్ లో ఉన్నప్పుడే సీమంతం కూడా జరిగింది. నీతూ మిత్రులు ఆమెకు ఘనంగా […]

Written By:
  • Shiva
  • , Updated On : November 21, 2021 / 11:26 AM IST
    Follow us on

    Bigg Boss Nataraj: బిగ్ బాస్ ఫేమ్ నటరాజ్ మాస్టర్ ఇంట్లో పండుగ నెలకొంది. ఆయన తండ్రిగా మారిన సంగతి తెలిసిందే. ఆయన భార్య నీతూ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్లో పాల్గొన్న నటరాజ్ మాస్టర్ వైఫ్ గర్భవతి అన్న విషయం తెల్సిందే. ఆయన హౌస్ లోకి వెళ్లే సమయానికి ఆమె నిండు గర్భంతో ఉన్నారు. ఇక నటరాజ్ హౌస్ లో ఉన్నప్పుడే సీమంతం కూడా జరిగింది. నీతూ మిత్రులు ఆమెకు ఘనంగా సీమంతం నిర్వహించారు.

    Also Read: అయ్యే గూగుల్.. ముందుగానే చెప్పేసిందే…

    Bigg Boss contestant Nataraj Master blessed with a baby girl

    నీతూ సీమంతం వీడియోను హౌస్ లో ఉన్న నటరాజ్(Bigg Boss Nataraj) మాస్టర్ కి చూపించగా, ఆయన ఎమోషనల్ అయ్యారు. తమకు అమ్మాయి పుట్టినట్టు నటరాజ్ మాస్టర్, సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. అయితే, అమ్మాయికి అచ్చం తన తల్లి పోలికలు వచ్చాయని.. అందుకే ఇక నా కూతురే నాకు అమ్మ అని నటరాజ్ మాస్టర్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు.

    ఈ సందర్భంగా సన్నిహితులు, మిత్రులకు పెద్ద పార్టీ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇక నటరాజ్ మాస్టర్ దంపతులకు నెటిజెన్స్ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. కాగా హౌస్ లో అగ్రెసివ్ నేచర్ తో నటరాజ్ మాస్టర్ ప్రేక్షకులలో నెగిటివ్ మార్క్స్ తెచ్చుకున్నాడు. దీంతో చాలా త్వరగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. అలాగే ఇటీవల ఎలిమినేటర్ కంటెస్టెంట్ విశ్వపై నటరాజ్ మాస్టర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

    గుంట నక్క పాపం పండింది, హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది, అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలకు నెటిజెన్స్ నుండి కౌంటర్లు పడ్డాయి. నటరాజ్ పై కొందరు తిట్ల దండకం అందుకున్నారు. ఏది ఏమైనా నటరాజ్ జీవితంలో పాప రాకతో సంతోషాలు వెదజల్లుతున్నాయి.

    Also Read: బిగ్ బాస్ ఫినాలే ఎప్పుడో తెలుసా.. చీఫ్ గెస్ట్ గా ఎవరొస్తున్నారంటే

    Tags