Hit 2 Movie: విశ్వక్ సేన్ హీరోగా 2020 లో వచ్చిన ‘హిట్’ మూవీ గురింకీ అందరికీ తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చి పెద్ద సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘హిట్ 2’ని కూడా ప్రకటించారు. ఈ సీక్వెల్ లో అడవి శేష్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈరోజు అడివి శేష్ పుట్టినరోజు సందర్భంగా ‘హిట్ 2’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. చిన్న సినిమాలు తీయడానికి నాని స్థాపించిన వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అడివి శేష్ ఈ సినిమాలో కేడీ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.
hit 2 movie first glimps released for hero adivi sesh birth day gift
Also Read: పెళ్లివైపు గాలి మళ్లిందంటున్న అడవి శేష్.. వచ్చే ఏడాదిలోనే వివాహం?
హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కింది. రెండో భాగం మాత్రం ఆంధ్రప్రదేశ్ బ్యాక్‌డ్రాప్‌లో రానుంది. ఈ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశాక సెట్స్‌కు ఎప్పుడు వెళ్లిందో కూడా తెలియరాలేదు. కేవలం గ్లింప్స్‌ను మాత్రమే షూట్ చేశారా… రెగ్యులర్ షూటింగ్ కూడా అయిపోయిందా అనే సంగతి తెలియరాలేదు. అయితే ఈ గ్లింప్స్‌లో ఉన్న షాట్లను చూస్తే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైందని అనుకోవచ్చు. కానీ గత కొంతకాలం నుంచి శేష్ పూర్తిగా మేజర్ షూట్ మీదే దృష్టి పెట్టినట్లు కనిపించింది. ఈ సినిమా షూటింగ్ గురించి ఇంతవరకు ఒక్క అప్‌డేట్ కూడా రాలేదంటే ఎంత సీక్రెట్‌గా షూట్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
Bigger,Better and edge of the blade #HIT2
Happy birthday to our KD @AdiviSesh
With #Major and #HIT2 you are going to have the best year yet 🤗
Here’s the surprise for you #GlimpseOfKD https://t.co/e9EGWTFFDb@adivisesh
@saileshkolanu
@prashantitipirn#meenakshichaudhary pic.twitter.com/TQbCBdnM68— Nani (@NameisNani) December 17, 2021
Also Read: “అంతఃపురం”సినిమాతో రానున్న హీరో ఆర్య… విడుదల ఎప్పుడంటే?