https://oktelugu.com/

CM KCR: కేసీఆర్‌ భయపడుతున్నాడా..!?

కేసీఆర్‌లో ఆకస్మిక మార్పులకు మూడు కారణాలు చెబుతున్నారు విశ్లేషకులు. మొదటిదేమో రాబోయే ఎన్నికల్లో రైతుల ఓట్లు వేయించుకోవటం. రెండో కారణం అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలకు సమాధానం చెప్పుకోవాల్సి రావటం.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 3, 2023 / 06:12 PM IST

    CM KCR

    Follow us on

    CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భయపడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుంటే కేసీఆర్‌లో టెన్షన్‌ పెరుగుతుందా.. అందుకే ఆయన ఆకస్మిక వరాలు ఇస్తున్నారా.. అంటే అవుననే అంటున్నాయి బీఆర్‌ఎస్‌ వర్గాలు. ఐదేళ్లుగా రైతుల రుణమాఫీ గురించి విపక్షాలు ఎంత గొడవ చేసినా పట్టించుకోని గులాబీ బాస్‌.. రైతు రుణమాఫీ హామీని అమలు చేయాలని ఉన్నతాధికారులను సడన్‌గా ఆదేశించడమే కేసీఆర్‌ భయపడుతున్నాడనేందుకు నిదర్శనమంటున్నారు విశ్లేషకులు. ఆ భయాన్ని కప్పిపుచ్చుకునేందుకు తనకు రైతులే ముఖ్యం అన్నట్లు ఓ ప్రకటన జారీ చేశారు. ఇక కేటీఆర్‌ అయితే రుణమాఫీ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సంబురాలు నిర్వహించాలని ఆదేశించారు.

    ఎన్నికల భయంతో ఎంత మార్పు..
    కేసీఆర్‌లో ఆకస్మిక మార్పులకు మూడు కారణాలు చెబుతున్నారు విశ్లేషకులు. మొదటిదేమో రాబోయే ఎన్నికల్లో రైతుల ఓట్లు వేయించుకోవటం. రెండో కారణం అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలకు సమాధానం చెప్పుకోవాల్సి రావటం. మూడో కారణం ఏమిటంటే ఇప్పటికే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు రైతు వ్యతిరేకి ముద్ర వేయడం.

    రుణమాఫీకి రూ.27 కోట్లు అవసరమని.
    రుణమాఫీ చేయాలంటే రు. 27 వేల కోట్లు అవసరమని 2018లోనే ప్రభుత్వం లెక్కలు గట్టింది. నాలుగేళ్లలో విడతలవారీగా చెల్లిస్తామని అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్‌ తర్వాత పట్టించుకోలేదు. మొత్తం మీద ఇప్పటివరకు సుమారు రు.1,207 కోట్లు మాత్రమే కేటాయించారు. ప్రతీ ఏడాది బడ్జెట్లో కేటాయింపులు చూపుతున్నా.. నిధులు విడదుల చేయడం లేదు. దీంతో రుణమాఫీ పథకం అటకెక్కిందని అంతా భావించారు.

    ప్రతిపక్షాల ఒత్తిళ్లకు తలొగ్గి..
    రాబోయే ఎన్నికల్లో రైతుల ఓట్లు, ప్రతిపక్షాల ఒత్తిళ్ళు, అసెంబ్లీ సమావేశాలు అన్నీ కలిపి కేసీఆర్‌లో భయం పెంచేశాయి. అందుకనే సడెన్‌గా రుణమాఫీకి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. ఇపుడు రు.19 వేల కోట్లు మాఫీ చేస్తారు బాగానే ఉంది మరి మిగిలిన సుమారు రు. 6 వేల కోట్ల మాఫీ ఎప్పడున్నదే ప్రశ్నగా మిగిలిపోయింది. కేసీఆర్‌ వైఖరి చూస్తుంటే ఏదైనా తప్పని పరిస్ధితులు ఎదురైనపుడు మాత్రమే ఇచ్చిన హామీలను అమలుచేస్తారని అర్ధమవుతోంది. లేకపోతే హామీలన్నీ గాలికే అనడానికి రైతు రుణమాఫీ హామీనే నిదర్శనం. ఇంకా రెండో విడత దళితబంధు, గొర్రెల పంపిణీ, మైనారిటీలకు రూ.లక్ష సాయం, బీసీలకు ఆర్థికసాయం తదతర స్కీంలు కూడా అమలు చేయాలి. లేకుంటే వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీకి ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.