CM Jagan: జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్

అమరావతిలో రాజధాని రైతులు నుంచి సేకరించిన భూముల్లో ఆర్ 5 జోన్ ఏర్పాటు చేశారు. ఇది చట్ట విరుద్ధమని తెలుసు. దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి.

Written By: Dharma, Updated On : August 3, 2023 6:00 pm

CM Jagan

Follow us on

CM Jagan: జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆర్ 5 జోన్లో ఇళ్ల నిర్మాణం పై స్టే ఇచ్చింది. నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో అమరావతిలో స్థానికేతర పేదలకు ఇల్లు కట్టించి ఇవ్వాలన్న జగన్ అసలు లక్ష్యానికి గండి పడింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు దాకా వెళ్లి ఇళ్ల నిర్మాణానికి అట్టహాసంగా జగన్ శంకుస్థాపన చేశారు. వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణం చేపట్టి అమరావతి రైతులకు, విపక్షాలకు షాక్ ఇవ్వాలని భావించారు. కానీ హైకోర్టు ఆ ప్రయత్నాలను అడ్డుకట్ట వేసింది.

అమరావతిలో రాజధాని రైతులు నుంచి సేకరించిన భూముల్లో ఆర్ 5 జోన్ ఏర్పాటు చేశారు. ఇది చట్ట విరుద్ధమని తెలుసు. దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. తొలుత ఇక్కడ ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. కానీ ఇవి రిజర్వ్ స్థలాలు కావడం.. కోర్టులో కేసు నడుస్తుండడంతో.. కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇళ్ల నిర్మాణానికి సాయం చేయడానికి వెనకడుగు వేసింది.

నిజానికి సుప్రీంకోర్టు ఒకటి చెబితే రాష్ట్రం ఇంకోలా చేసింది. చట్టబద్ధమైన అధికారము దఖలు పడే అవకాశం లేదని… తుది తీర్పు తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందని చెప్పుకొచ్చింది. కానీ జగన్ సర్కార్ హడావుడిగా శంకుస్థాపన చేసింది. రాష్ట్రంలో ఎక్కడా సొంతంగా ఇల్లు కట్టించలేదు కానీ… అమరావతిలో మాత్రం 50 వేల ఇళ్లు కట్టిస్తామని చెప్పుకొచ్చింది. ఈ వివాదాస్పద భూమిలో ఇళ్లు కడితే డబ్బులు ఇచ్చేది లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఇప్పుడు హైకోర్టు సైతం స్టే విధించడంతో పేద లబ్ధిదారులు వైసీపీ సర్కార్ వైపు అనుమానంగా చూస్తున్నారు. తమను పావులుగా వాడుకుంటున్నారన్న సత్యాన్ని గ్రహిస్తున్నారు.