https://oktelugu.com/

Telangana Budget : గవర్నర్ లేకుండానే నేడు తెలంగాణ బడ్జెట్.. ఏకంగా 2.70 లక్షల కోట్లు.. ప్రతిపక్షాలు సిద్ధం..

telangana budget may be 2.70 lakh crores : ఏకంగా రాష్ట్ర ప్రథమ పౌరురాలు అయిన గవర్నర్ తమిళిసై లేకుండానే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఆమె ప్రసంగం లేకుండా.. ధన్యవాదాల తీర్మానం చేయకుండానే ఈ సాహసం చేస్తున్నారు. బీజేపీతో ఫైట్ కు దిగిన కేసీఆర్ ఈమేరకు బీజేపీ అపాయింట్ చేసిన గవర్నర్ తమిళిసైని పక్కనపెట్టి మరీ బడ్జెట్ సమావేశాలకు దిగుతున్నారు. దీనిపై ప్రతిపక్షాలు కూడా యుద్ధానికి సిద్ధమయ్యాయి. దీంతో బడ్జెట్ సమావేశాలు ఎలా జరుగుతాయన్నది […]

Written By: , Updated On : March 7, 2022 / 10:24 AM IST
Follow us on

telangana budget may be 2.70 lakh crores : ఏకంగా రాష్ట్ర ప్రథమ పౌరురాలు అయిన గవర్నర్ తమిళిసై లేకుండానే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఆమె ప్రసంగం లేకుండా.. ధన్యవాదాల తీర్మానం చేయకుండానే ఈ సాహసం చేస్తున్నారు. బీజేపీతో ఫైట్ కు దిగిన కేసీఆర్ ఈమేరకు బీజేపీ అపాయింట్ చేసిన గవర్నర్ తమిళిసైని పక్కనపెట్టి మరీ బడ్జెట్ సమావేశాలకు దిగుతున్నారు. దీనిపై ప్రతిపక్షాలు కూడా యుద్ధానికి సిద్ధమయ్యాయి. దీంతో బడ్జెట్ సమావేశాలు ఎలా జరుగుతాయన్నది ఆసక్తి రేపుతోంది.

తెలంగాణ అసెంబ్లీలో నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బాహుబలి బడ్జెట్ గా పేర్కొంటున్న ఈసారి 2.70 లక్షల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈమేరకు మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది. గత సంవత్సరం రూ.2.30,825 కోట్లు ఉంది. అయితే ఇది తొలిసారి బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభం కాబోతున్నాయి. అయితే గత సమావేశాలకు కొనసాగింపుని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా.. కాల పరిమితి దాటినందున వీటిని కొత్తగా ప్రారంభించే సమావేశాల మాదిరిగానే పరిగణించాలని గవర్నర్ తమిళి సై అన్నారు. అయితే బీజేపీ మాత్రం గవర్నర్ లేకుండా సమావేశాలు ప్రారంభించడంపై ఇప్పటికే తీవ్ర విమర్శలు చేసింది. కాగా బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత దీనిపై సమావేశాలు కొనసాగనున్నాయి.

ఇప్పటి వరకు ప్రవేశ పెట్టిన దాని కంటే 2002-2023 బడ్జెట్ కు అధిక ప్రాధాన్యం కలిగింది. ఎందుకంటే నేటి బడ్జెట్లో ఎక్కువగా సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఇప్పటికే ప్రవేశపెట్టిన పథకాల కొనసాగింపునకు నిధులు కేటాయించగా.. కొత్తగా ప్రవేశపెట్టిన దళిత బంధుకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు రైతు బంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాలు నిధులు కేటాయించే అవకాశం ఉంది. అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా రెండు రోజులుగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈసారి మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం.

ఈసారి బడ్జెట్ ను మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టనున్నారు. హరీశ్ రావు వద్ద ఉన్న ఈ శాఖను మార్చుతారని అన్నారు. కానీ ఈసారి ఆయనే ప్రవేశపెట్టనున్నారు. గత సంవత్సరం ఆర్థిక మంత్రి హరీశ్ రావు రూ.2,30,825.96 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈసారి కూడా ఆయన ఎలాంటి పద్దులు వివరిస్తారోనన్న ఆసక్తి నెలకొంది. అయితే అంతా కేసీఆర్ కనుసన్నల్లోనే ఈ బడ్జెట్ రూపకల్పన జరిగినా.. హరీశ్ రావు దీనిని చదువుతారు.

ఇదిలా ఉండగా ఈ బడ్జెట్ కు అధిక ప్రాధాన్యత కలిగి ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉంటాయని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ ను తయారు చేశారని అంటున్నారు. అయితే కేసీఆర్ పైకి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని చెబుతున్నా.. కొన్ని అనుసరిస్తున్న విధానాలను చూస్తే మాత్రం ఎన్నికల హడావుడిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈసారి భారీ బడ్జెట్ ప్రవేశపెట్టి దేశంలో తెలంగాణ చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించే ప్రయత్నం చేసే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ప్రశ్నలు అడగాలని ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా గత బడ్జెట్లో అధికార పార్టీలో ఉన్న ఈటల రాజేందర్ ఇప్పుడు అదే ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. ప్రభుత్వంలో ఉన్న లొసగులన్నీంటిపై నిలదీయాలని ఈటల బృందం రెడీ అవుతోంది. అటు కాంగ్రెస్ సైతం ప్రభుత్వంపై ప్రశ్నల అస్త్రాలను సంధించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం చేస్తున్న తప్పులపై నిలదీస్తామని ఆ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి ఇప్పటికే మీడియా ముందు చెప్పారు.