Telangana Budget 2022-23: తెలంగాణ ప్రభుత్వం 2022-23 సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు శాసనసభలో సోమవారం ప్రవేశపెట్టారు. రూ.2.56 లక్షల కోట్లు బడ్జెట్ లో ప్రతిపాదించింది. దీంతో పలు రంగాలకు బడ్జెట్ కేటాయించింది. దీన్ని హరీష్ రావు శాసనసభ వేదికగా వెల్లడించారు. ఇది ముమ్మాటికి కేసీఆర్ మార్క్ బడ్జెట్ అని కొనియాడారు. సమైక్యాంధ్రలో ఉన్న సమస్యలను పరిష్కరించుకుని దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందని చెబుతున్నారు.

రెవెన్యూ వ్యయం రూ.1.89 లక్షల కోట్లు కాగా క్యాపిటల్ వ్యయం రూ.29,728 కోట్లుగా తేల్చారు. ఇందులో దళితబంధుకు రూ.17,700 కోట్లు కేటాయించారు. పల్లె ప్రగతికి రూ. 330 కోట్లు ఇవ్వనున్నారు. పట్టణ ప్రగతికి రూ. 1,394 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయించారు. కొత్త వైద్యశాలలకు రూ. వెయ్యి కోట్లు, అటవీ విశ్వవిద్యాలయానికి రూ. వంద కోట్లు, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, నారాయణ పేట్, గద్వాల, ములుగు, యాదాద్రిలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు తయారు చేసింది.
Also Read: మూడు రాజధానుల అంశాన్ని అలా వాడేస్తున్న జగన్.. ఇది మామూలు ప్లాన్ కాదు గురూ..!
మహిళా వర్సిటీకి రూ. వంద కోట్లు, రూ. 50 వేల లోపు ఉన్న రైతు రుణాలు మార్చి లోపు మాఫీ చేస్తామని చెప్పింది. రూ. 16,144 కోట్ల పంట రుణాలు మాఫీ, వచ్చే ఏడాది రూ.75 వేల లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని పేర్కొంది. వ్యవసాయ రంగానికి రూ.24,254 కోట్లు, హరితహారానికి రూ.934 కోట్లు కేటాయించారు. ఇంకా బ్రాహ్మణ సంక్షేమానికి రూ.177 కోట్లు విడుదల చేశారు.

బీసీ సంక్షేమానికి రూ. 5,698 కోట్లు, ఎస్టీ సంక్షేమం కోసం రూ. 12,565 కోట్లు, పోలీస్ సంక్షేమానికి రూ. 9,315 కోట్లు, రోడ్ల మరమ్మతుకు రూ. 1,542 కోట్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కు రూ. 2,750 కోట్లు, కొత్త ఆసరా పింఛన్ లబ్ధిదారులకు రూ. 11,728 కోట్లు, గిరిజన గ్రామపంచాయతీల కోసం రూ. 600కోట్లు కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
Also Read: కేంద్రం, గవర్నర్ సపోర్టు లేకుండా కేసీఆర్ ఆ పని చేయగలరా.. అసలు ప్లాన్ వేరే ఉందా..?
[…] Also Read: తెలంగాణ బడ్జెట్ రూ.2.56 లక్షల కోట్లు […]