Telangana Budget Session 2022: తెలంగాణ శాసనసభ నిర్వహణ గవర్నర్ ప్రసంగం లేకుండా చేయడంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ తన పంతం నెగ్గించుకునే క్రమంలో గవర్నర్ ను సభకు ఆహ్వానించకపోవడంపై అందరిలో విమర్శలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్ నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం కలుగుతోంది. ఇన్నాళ్ల కాలంలో ఎప్పుడు కూడా గవర్నర్ లేకుండా శాసనసభ వ్యవహారాలు ప్రారంభం కాలేదని తెలుస్తోంది. కానీ ఈసారి మాత్రం గవర్నర్ ను సభకు రాకుండా చేయడంతో కేసీఆర్ అప్రదిష్టను మూటగట్టుకున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
దీనిపై బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, విజయరఘునందన్ రావు, రాజాసింగ్ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని సూచిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఒంటెత్తు పోకడ పోతున్నారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ కు రోజులు దగ్గర పడ్డాయని చెబుతున్నారు. దానికి సంకేతమే గవర్నర్ ప్రసంగాన్ని లేకుండా చేయడమేనని వ్యాఖ్యానించారు.
Also Read: కేంద్రం, గవర్నర్ సపోర్టు లేకుండా కేసీఆర్ ఆ పని చేయగలరా.. అసలు ప్లాన్ వేరే ఉందా..?
రాజ్యాంగ బద్దంగా నియమితులైన గవర్నర్ విషయంలో కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరును అందరు ఆక్షేపిస్తన్నారు. రాజకీయాలకతీతంగా ఉండాల్సిన సీఎం రాజకీయాలను ప్రధానంగా చేసుకుని ముందుకు వెళ్తున్నారని విమర్శలు వస్తున్నాయి. బీజేపీపై ఉన్న కోపంతోనే గవర్నర్ ను సభకు రానివ్వడం లేదని తెలుస్తోంది. దీనిపై తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం వస్తుందని బీజేపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు.
సంప్రదాయం ప్రకారం గవర్నర్ ప్రసంగం తరువాత వారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఉన్నా దాన్ని పక్కన పెట్టేసి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారనే అపవాదు మూటగట్టుకుంటున్నారు. పైగా గవర్నర్ మహిళ కావడంతో ఆమెకు మద్దతుగా చాలా మంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఏకచత్రాధిపత్యం చేయాలని చూస్తున్నారనే విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు.
ఈ విషయంలో బీజేపీ ఎమ్మెల్యేలు కేసీఆర్ పై నిప్పులు చెరుగుతున్నారు. సంప్రదాయాలను పక్కన పెట్టేసి ఏం సాధిస్తారని ప్రశ్నిస్తున్నారు. గవర్నర్ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి మాత్రమే చెబుతున్నా కేసీఆర్ ఎందుకు ఆమెను పట్టించుకోవడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ తతంగం ఎక్కడికి వెళ్తుందో తెలియడం లేదు.
Also Read: యూపీలో చివరి దశ పోలింగ్.. అందరి కన్ను మోడీ, అఖిలాష్ ఇలాకాలపైనే