Telangana BJP Third List: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే మూడో జాబితాను భారతీయ జనతాపార్టీ గురువారం విడుదల చేసింది. 35 మందికి మూడో జాబితాలో టికెట్లు ఇచ్చారు. ఇప్పటికే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మెజార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో.. ఆ పార్టీల్లోని అసంతృప్తులను తమ వైపు తిప్పుకుని వారికి సీట్లు కేటాయించేందుకు బీజేపీ వేచిచూసే ధోరణిలో అభ్యర్థుల ఎంపికను జాప్యం చేస్తోంది. తాజాగా మూడో జాబితాలో 45 మంది వరకు టికెట్లు ఇస్తుందని అంచనా వేశారు. కానీ జనసేనతో పొత్తు, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అసంతృప్తుల రాక కోసం ఇంకా వేచిచూడడంతో 35 మందికే మూడో జాబితాలో టికెట్లు ఇచ్చారు.
తొలిజాబితాలో 52 మందికి..
గత నెల 22న బీజేపీ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మెుత్తం 52 మందితో తొలి జాబితాను రిలీజ్ చేసింది. లిస్టులో బీసీలతో పాటు సీనియర్లకు స్థానం కల్పించారు. ముగ్గురు ఎంపీలు ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, బోథ్ నుంచి సోయం బాపూరావు, కోరుట్ల నుంచి ధర్మపురి అర్వింద్ బరిలోకి దిగుతున్నారు. తర్వాత రెండో జాబితాలో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి తనయుడు మిథున్‌రెడ్డికి మాత్రమే టికెట్ ఇచ్చారు. తాజాగా 35 మందితో మూడో జాబితా విడుదల చేశారు. దీంతో 119 స్థానాలకు గాను బీజేపీ ఇప్పటి వరకు 88 మందకి టికెట్లు ఇచ్చింది. మిగిలిన స్థానాలకు త్వరలోనే జాబితా ప్రకటించేందుకు కసరత్తు చేస్తుంది.
సీనియర్లు, కొత్తవారికి ఛాన్స్..
ఈసారి పలువురు పార్టీ సీనియర్ నేతలు, కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లు కేటాయించింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన అంబర్‌పేట నియోజకవర్గం నుంచి కృష్ణ యాదవ్ బరిలోకి దిగుతున్నారు. ఆంథోల్ నుంచి బాబుమోహ¯Œ కు టికెట్ ఇచ్చారు. ఉప్పల్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్.ప్రభాకర్, సనత్‌నగర్ నుంచి మర్రి శశిధర్‌రెడ్డికి టికెట్ ఇచ్చారు.
ఒకే ఒక్క మహిళ..
మూడో జాబితాలో ఒకే ఒక్క మహిళకు టికెట్ కేటాయించారు. హుజూర్ నగర్ నుంచి శ్రీలతారెడ్డికి ఛాన్స్ దక్కింది. బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డికి టికెట్ దక్కలేదు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి స్థానం నుంచి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని కూకట్‌పల్లి, షేర్‌లింగంపల్లి, మల్కాజ్‌గిరి, కంటోన్‌మెంట్, నాంపల్లి టికెట్లను పెండింగ్‌లో పెట్టారు. హుస్నాబాద్, వేములవాడ టిక్కెట్లు కూడా కేటాయించలేదు. బీజేపీ తొలి జాబితాలో బీసీలు, మహిళలకు పెద్దపీట వేశారు. 20 మంది బీసీలు, 12 మంది మహిళలకు చోటు కల్పించారు. 8 మంది ఎస్సీలు, ఆరుగురు ఎస్సీలకు అవకాశమిచ్చారు.
బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా..
ఆసిఫాబాద్ – అజ్మీరా ఆత్మారామ్ నాయక్
బాన్సువాడ – యెండల లక్ష్మీనారాయణ
మంథని – చందుపట్ల అనిల్‌రెడ్డి
బోధ¯Œ – వద్ది మోహన్‌రెడ్డి
అంబర్‌పేట – కృష్ణాయాదవ్
సికింద్రాబాద్ – మేకల సారంగపాణి
జూబ్లీహిల్స్ – లంకల దీపక్‌రెడ్డి
ముషీరాబాద్ – పూస రాజు
పరిగి– మారుతీ కిరణ్
రాజేంద్రనగర్– తోకల శ్రీనివాసరెడ్డి
ఉప్పల్ – ఎన్వీఎస్‌ఎస్.ప్రభాకర్
ఎల్బీనగర్ – సామ రంగారెడ్డి
సనత్‌నగర్ – మర్రి శశిధర్ రెడ్డి
హుజూర్‌నగర్ – శ్రీలతారెడ్డి
మంచిర్యాల – రఘునాథ్
నిజాబాబాద్ రూరల్ – దినేష్
మెదక్ – విజయ్‌కుమార్
ఎల్బీనగర్ – సామ రంగారెడ్డి
రాజేందర్‌నగర్ – శ్రీనివాస్‌రెడ్డి
పరిగి – మారుతి కిరన్
జూబ్లిహిల్స్ – దీపక్‌రెడ్డి
జడ్చర్ల – చిందరంజన్ దాస్
షాద్‌నగర్ – బాబయ్య
ఆలేరు – పడాల శ్రీనివాస్
పినపాక – బాలరాజు
పత్తుపల్లి – రామలింగేశ్వర్‌రావు
నారాయణఖేడ్ – సంగప్ప
వనపత్తి ఆశ్వత్తామరెడ్డి
పాలేరు – నున్న రవికుమార్
ముషీరాబాద్ – రాజు
మక్తల్ జలంధర్‌రెడ్డి
అచ్చంపేట – సతీశ్
జహీరాబాద్ – రాజనర్సింహ