Telangana BJP: తెలంగాణలో పవన్ పైనే బిజెపి ఆశలు

ఫ్రీ ఎగ్జిట్ పోల్ సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడవుతున్నాయి. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పదని తేల్చుతున్నాయి. అయితే ఈ విషయంలో బిజెపి వెనుక పడడం విశేషం.

Written By: Dharma, Updated On : November 6, 2023 3:38 pm
Follow us on

Telangana BJP: తెలంగాణలో ప్రచార హోరు పతాక స్థాయికి చేరుకుంది. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో అంతట సందడి నెలకొంది. అధికార బీఆర్ఎస్ దూకుడును కొనసాగిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. బిజెపి ఉనికి చాటుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. జనసేనతో జత కట్టింది. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో.. ప్రధాన పార్టీలు ప్రచారంపై ఫోకస్ పెంచాయి. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా అగ్రనేతలు ప్రచారం చేయనున్నారు. జాతీయస్థాయిలో నేతలు తెలంగాణకు క్యూ కడుతున్నారు.

ఫ్రీ ఎగ్జిట్ పోల్ సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడవుతున్నాయి. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పదని తేల్చుతున్నాయి. అయితే ఈ విషయంలో బిజెపి వెనుక పడడం విశేషం. మొన్నటివరకు అధికారమో.. లేకుంటే ద్వితీయ స్థానము అన్నట్టుబిజెపి పోరాటం కనిపించింది. కానీ ఎందుకో ఎన్నికల నాటికి ఆ పోరాట పటిమ తగ్గింది. నాయకులు ఒక్కొక్కరుగా చేజారడం, కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వైపు వెళ్లడం తదితర కారణాలతో బిజెపి వెనుకబడింది. ఇటువంటి తరుణంలో ఆ పార్టీ ప్రధాని మోదీపై ఆశలు పెట్టుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ చరిష్మ పనిచేయడంతో బిజెపి నాలుగు పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంది. ఇప్పుడు సైతం మోదీ ప్రభావం చూపగలరని నమ్మకం పెట్టుకుంది.

మరోవైపు పవన్ కళ్యాణ్ సైతం బిజెపిని గట్టెక్కిస్తారని అగ్ర నేతలు భావిస్తున్నారు. అందుకే పవన్ కు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. అటు పవన్ సైతం పొత్తుకు అంగీకరించారు. తెలంగాణలో ప్రధాని మోదీ తో పాటు ఎన్నికల సభల్లో పాల్గొనాలని తీర్మానించారు. ఈనెల ఏడో తేదీన హైదరాబాదులో బీసీ ఆత్మ గౌరవ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. అటు మున్నూరు కాపుల్లో పవన్ కు మంచి క్రేజ్ ఉంది. ఆ ఫాలోయింగ్ ఉపయోగించుకుని మున్నూరు కాపు ఓట్లను దక్కించుకోవాలని బిజెపి ప్లాన్ చేస్తోంది. పవన్ సైతం ప్రధాని మోదీతో పాటే ఎన్నికల సభలో పాల్గొనాలని డిసైడ్ కావడం తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఒకానొక దశలో పవన్ కళ్యాణ్ బిజెపితో జతకట్టారని.. చివరి నిమిషంలో డ్రాప్ అవుతారని అంతా భావించారు. బిజెపి సైతం పవన్ మద్దతు వరకే కోరుతుందని.. పొత్తు పెట్టుకోదని విశ్లేషణలు వెలుపడ్డాయి. ఇప్పటికే జనసేన 32 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. దీంతో సీట్లకు పట్టు పడుతుందని అంతా భావించారు. కానీ తొలుతా 12 సీట్లకు పట్టుబడినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం తొమ్మిది సీట్లకే సర్దుబాటు జరిగిందని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రానుంది. అయితే సీట్లతో పని లేకుండా పవన్ ఒప్పించడంలో బిజెపి నేతలు సక్సెస్ అయ్యారు. పవన్ ప్రచారంలోకి తేవడం ప్లస్ గా మారుతుందని బిజెపి శ్రేణులు బలంగా విశ్లేషిస్తున్నాయి. టిడిపి పోటీలో లేకపోవడం.. పవన్ సపోర్ట్ లభించడంతో సెటిలర్స్ ఓట్లు తమకే లభిస్తాయని బిజెపి ఆశ పెట్టుకుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.