https://oktelugu.com/

ఓవ‌ర్సీస్ లో దుమ్ములేపుతున్న జాతిర‌త్నాలు.. బ‌ద్ద‌లైపోతున్న బాక్సాఫీస్‌!

చిన్న చిత్రంగా రిలీజై.. బాక్సాఫీస్ ను దున్నేస్తూ పెద్ద చిత్రంగా మారిపోయింది ‘జాతిర‌త్నాలు’! తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లు కొల్లగొడుతున్న ఈ చిత్రం.. ఓవర్సీస్ లోనూ దుమ్ములేపుతోంది. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో భారీ వ‌సూళ్లు సాధిస్తూ.. ట్రేడ్ పండితుల‌ను కూడా ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. Also Read: భ‌ర్త రామ్ తో ఎంజాయ్ చేస్తున్న కొత్త పెళ్లి కూతురు సునీత‌! శివ‌రాత్రి సంద‌ర్భంగా ఈ నెల 11న రిలీజ్ అయిన జాతిర‌త్నాలు.. మొద‌టి ఆట నుంచే తెలుగు రాష్ట్రాల్లో […]

Written By:
  • Rocky
  • , Updated On : March 15, 2021 / 01:06 PM IST
    Follow us on


    చిన్న చిత్రంగా రిలీజై.. బాక్సాఫీస్ ను దున్నేస్తూ పెద్ద చిత్రంగా మారిపోయింది ‘జాతిర‌త్నాలు’! తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లు కొల్లగొడుతున్న ఈ చిత్రం.. ఓవర్సీస్ లోనూ దుమ్ములేపుతోంది. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో భారీ వ‌సూళ్లు సాధిస్తూ.. ట్రేడ్ పండితుల‌ను కూడా ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

    Also Read: భ‌ర్త రామ్ తో ఎంజాయ్ చేస్తున్న కొత్త పెళ్లి కూతురు సునీత‌!

    శివ‌రాత్రి సంద‌ర్భంగా ఈ నెల 11న రిలీజ్ అయిన జాతిర‌త్నాలు.. మొద‌టి ఆట నుంచే తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ టాక్ తో దూసుకెళ్లింది. అటు అమెరికాలోనూ ఇదే రిజ‌ల్ట్ న‌మోదైంది. తొలిరోజే 2,31,135 డాల‌ర్లు వ‌సూలు చేసి ఊహించ‌ని షాక్ ఇచ్చిందీ చిత్రం.

    రెండో రోజుతోపాటు మూడో రోజున కూడా క‌లెక్ష‌న్ల హ‌వా కొన‌సాగింది. అమెరికాలో క‌రోనా కార‌ణంగా జ‌నాలు చాలా కాలంగా సినిమాకు దూరంగా ఉండ‌డం.. ఈ మూవీ కామెడీ ప‌రంగా సూప‌ర్బ్ అనే టాక్ రావ‌డంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు క్యూ క‌ట్టారు. దీంతో చాలా ప్రాంతాల్లో హౌజ్ ఫుల్ గా ర‌న్ అయ్యింది. ఆ విధంగా.. రెండో రోజు 1,52,500 డాల‌ర్లు రాబ‌ట్టిన ఈ చిత్రం.. మూడో రోజు 1,92,071 డాల‌‌ర్లు కొల్ల‌గొట్టింది.

    Also Read: వీర‌మ‌ల్లు హీరోచిత విన్యాసాలు.. అశ్వ సార‌థ్యంలో చుక్క‌లేన‌ట‌!

    మొత్తంగా విడుద‌లైన మూడు రోజుల్లోనే.. ఓవ‌ర్సీస్ లో హాఫ్ మిలియ‌న్ క్ల‌బ్ లో చేరిన చిత్రంగా నిలిచింది జాతిర‌త్నాలు! ప్ర‌స్తుతం అమెరికాలో అత్య‌ధిక క‌లెక్ష‌న్లు సాధించిన ఐదో చిత్రంగా నిలిచిందీ మూవీ. రోజురోజుకూ క‌లెక్ష‌న్లు పెరుగుతుండ‌డంతో మిలియ‌న్ డాల‌ర్ల ట్రేడ్ మార్కును అందుకుంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు ట్రేడ్ ఎన‌లిస్టులు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్