Teenmaar Mallanna VS Ktr: సామాజిక మాధ్యమాల ద్వారా విమర్శలు పెరుగుతున్నాయి. ఇటీవల జైలు నుంచి విడుదలైన క్యూ న్యూస్ అధినేత, తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ సామాజిక మాధ్యమ వేదికగా చేసిన కార్యక్రమం దుమారం రేపుతోంది. సోషల్ మీడియా అపహాస్యం పాలవుతోందని మంత్రి కేటీఆర్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. తీన్మార్ మల్లన్న నిర్వహించిన పోల్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి అనేది ఎక్కడ ఉంది భద్రాచలం గుడిలోనా? హిమాన్షు శరీరంలోనా అంటూ ఆప్షన్లు ఇవ్వడంతో కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై మంత్రి కేటీఆర్ మల్లన్నపై తీవ్ర ఆరోపణలు చేశారు అసహ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న వారిపై ఏం చేసినా తక్కువే అని సమాధానం ఇచ్చారు. సోషల్ మీడియా ఉన్నది మంచి పనులు చేయడానికే కానీ వ్యక్తిగత విమర్శలకు దిగడం సముచితం కాదని అన్నారు. మల్లన్న చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని నిరసన వ్యక్తం చేశారు.
Also Read: CM KCR: ‘ముందస్తు’కు వెళ్లితే కేసీఆర్ తన గొయ్యి తాను తవ్వుకున్నట్టేనా?
పసివాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయనకే సాధ్యం. తన కొడుకు శరీరాకృతిపై ఆరోపణలు చేయడం ఆయనకే చెల్లింది. మేం కూడా ఆరోపణలు చేయగలం కానీ మీలా కాదు. మంచి పనులకు మంచి విషయాలను ఉదాహరణగా తీసుకోవడం చేస్తుంటాం. కానీ వ్యక్తిగత విషయాలను ప్రచారం చేస్తూ ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు.
జర్నలిజం పేరుతో చెడు పనులు కాకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే బాగుంటుంది. అంతే కానీ పనికి రాని విషయాలపై ఫోకస్ పెట్టి తమ చానల్ రేటు పెంచుకో వాలని చూడడం సహేతుకం కాదు. అనవసర ప్రచారాలు మానుకుని అవసరమైన వాటిని ఫోకస్ చేసి ప్రజలక ఉపయోగపడే పనులు చేపట్టాలని సూచించారు. మొత్తానికి తీన్మార్ మల్లన్న చేసిన ఓ వ్యాఖ్య రాష్ర్టంలో పెనుసంచలనమే సృష్టిస్తోంది.
Also Read:KTR vs Sharmila: కేటీఆర్ వర్సెస్ షర్మిల: నాడు తెలియదందీ.. నేడు పొగిడేసింది..!