https://oktelugu.com/

Boycott83: ‘బాయ్ కాట్ 83’ వెనుక ఉన్నది ఎవరంటే?

Boycott83: క్రిస్మస్ కానుకగా ‘83’ మూవీ అభిమానుల ముందుకొచ్చింది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీకి ప్రముఖ ఓటీటీల నుంచి భారీ ఆఫర్ వచ్చినా దర్శక, నిర్మాతలు థియేట్రీకల్ రిలీజు కోసం వేచిచూశారు. ఎట్టకేలకు థియేటర్లలో రిలీజైన ‘83’ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. అయితే ఈ మూవీని బాయ్ కాట్ చేయాలంటూ నెటిజన్లు ట్వీటర్లో […]

Written By:
  • NARESH
  • , Updated On : December 25, 2021 / 11:57 AM IST
    Follow us on

    Boycott83: క్రిస్మస్ కానుకగా ‘83’ మూవీ అభిమానుల ముందుకొచ్చింది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీకి ప్రముఖ ఓటీటీల నుంచి భారీ ఆఫర్ వచ్చినా దర్శక, నిర్మాతలు థియేట్రీకల్ రిలీజు కోసం వేచిచూశారు. ఎట్టకేలకు థియేటర్లలో రిలీజైన ‘83’ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

    అయితే ఈ మూవీని బాయ్ కాట్ చేయాలంటూ నెటిజన్లు ట్వీటర్లో హ్యష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. #boycott83 పేరుతో ట్వీటర్లో ఉదయం నుంచి ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతూ ట్వీటర్లో టాప్ ప్లేసును దక్కించుకుంది. ఈ చిత్రంలో ఎలాంటి వివాదాస్పద అంశాలు లేకపోయినప్పటికీ ఈ మూవీ బాయ్ కాట్ చేయాలని నెటిజన్లు ట్వీట్లు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

    1983లో టీంఇండియా ప్రపంచ క్రికెట్ కప్ ను గెలుచుకొని చరిత్రను సృష్టించింది. ఈ ఏడాది క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. భారత్ కు ప్రపంచ కప్ అందించడానికి కెప్టెన్ కపిల్ దేవ్ ఎలాంటి వ్యూహాలు అవలంభించారు? భారత్ కు కలిసొచ్చిన అంశాలు తదితర అంశాలన్నీంటికీ దర్శకుడు కబీర్ ఖాన్ ఈమూవీలో చక్కగా చూపించారు.

    ‘83’ మూవీని టాలీవుడ్ కు చెందిన విష్ణువర్దన్ ఇందూరి నిర్మించగా ఇందులో రణ్వీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రను పోషించాడు. దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటించింది. క్రికెటర్లతో హీరోయిన్స్ ఎలా సన్నిహితంగా ఉంటారనే అంశాలను ఇందులో చూపించే ప్రయత్నం చేశారు. దీంతో ఈ మూవీ ‘ఎంఎస్.ధోని’ తరహాలోనే క్లాసిక్ మూవీ అవుతుందనే ప్రశంసలను దక్కించుకుంది.

    అయితే ఈ మూవీ కపిల్ దేవ్ వ్యక్తిగత జీవితాన్ని పెద్దగా చూపించకపోవడం, సినిమా స్లోగా సాగడం మైనస్ గా మారాయి. ఇక ఈ చిత్రంలో ఎలాంటి వివాద్పద అంశాలను దర్శకుడు చూపించలేదు. అయితే కొందరు కావాలనే ట్వీటర్లో బాయ్ కాట్ 83ని హ్యష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు. దీని వెనుక సుశాంత్ సింగ్ ఫ్యాన్స్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

    బాలీవుడ్లోని మాఫియా కారణంగానే సుశాంత్ సింగ్ మరణించాడని అతడి ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఈనేపథ్యంలో బడా హీరోలు, హీరోయిన్ల సినిమాలపై వారంతా నెగిటివ్స్ కామెంట్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. బాలీవుడ్లో ఏ పెద్ద సినిమా రిలీజైన వారంతా కూడా సోషల్ మీడియాలో నెగిటివీని ప్రచారం చేస్తూ తమ ఆగ్రహాన్ని చూపిస్తున్నారు. 83 విషయంలోనే ఇలానే జరుగుతుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరీ ఈ ప్రభావం సినిమాపై ఉంటుందా? లేదా అనేది మాత్రం వేచిచూడాల్సిందే..!