Pegasus Issue: పెగాసస్ వ్యవహారంలో పార్లమెంట్ లోనే రగడ జరిగింది. దీనిపై ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆరోపణలకు కేంద్రం దిగి రావాల్సి వచ్చింది. దీనిపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అప్పట్లో పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేశారని సంచలన ఆరోపణలు చేయడంతో మళ్లీ రగడ రాజుకుంటుందని అందరు భావించారు. కానీ వైసీపీ దాన్ని ఉపయోగించుకోలేకపోయింది. దీంతో పెగాసస్ పై వైసీపీ లబ్ధి పొందలేకపోవడం గమనార్హం.

దీనిపై టీడీపీ ముందుగానే స్పందించింది. పెగాసస్ వ్యవహారంలో మమతా బెనర్జీ అసత్య ఆరోపణలు చేశారని టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు. దీనిపై తగిన ఆధారాలు చూపించి ఇదంతా వట్టిదేనని నిరూపించారు. దీంతో వైసీపీ నేతలు తెల్లమొహం వేశారు. అన్నింట్లో ఒంటికాలుపై లేసే నేతలు ఈ వ్యవహారంలో మాత్రం ఎందుకు స్పందించలేదనే వాదన కూడా వస్తోంది. ఇజ్రాయెల్ నుంచి పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేశారంటే మమత చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపలేకపోయారు. తరువాత కూడా దానిపై మాట్లాడలేదు.
Also Read: KCR Vs BJP: కేంద్రంతో రణమా.. శరణమా! కేసీఆర్ ప్లాన్ ఏంటి?
టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఈ తతంగంపై బయటపడింది. పెగాసస్ కొనుగోలు చేస్తే జగన్ సీఎం అయ్యేవాడా? వైఎస్ వివేకా హత్య జరిగేదా? అంటూ లోకేష్ ప్రశ్నించడంతో వైసీపీ నేతలు ఖంగుతిన్నారు. ఏం మాట్లాడలేకపోయారు. దీన్ని అవకాశంగా తీసుకుని టీడీపీ ఇచ్చిన సమాధానంతో వైసీపీ నేతలు కూడా స్పందించకపోవడం గమనార్హం.పెగాసస్ విషయంలో టీడీపీని కార్నర్ చేసేందుకు వైసీపీ ముందుకు రాలేదు. దీంతో చంద్రబాబుపై చేసిన ఆరోపణలు వట్టివే అని తేలిపోయాయి.

ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర్ రావును సస్పెండ్ చేసింది. దీంతో ఆయనపై చార్జీషీటు కూడా దాఖలు చేయాలని లేఖ రాసింది. అయినా వైసీపీ స్పందించలేదు. చంద్రబాబు పెగాసస్ వ్యవహారంలో చాకచక్యంగా వ్యవహరించి బయటపడినట్లు తెలుస్తోంది. ఇందులో వైసీపీ మాత్రం సరైన రీతిలో స్పందించకుండా నష్టపోయిందని చెబుతున్నారు.
Also Read: YCP vs BJP: జగన్ పై జగడానికే బీజేపీ రెడీనా?
Recommended Video:
[…] Also Read: Pegasus Issue: పెగాసస్ వ్యవహారంలో బాబు సేఫ్.. వ… […]