Homeజాతీయ వార్తలుSatya Nadella : భారీగా పెరిగిన సత్యనాదెళ్ల వేతనం.. ఇప్పుడు ఎంతో తెలుసా?

Satya Nadella : భారీగా పెరిగిన సత్యనాదెళ్ల వేతనం.. ఇప్పుడు ఎంతో తెలుసా?

Satya Nadella : సత్యనాదెళ్ల.. ప్రముఖ టెక్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ సీఈవో. దాదాపు ఐదేళ్లుగా ఆయన ఈ హోదాలో కొనసాగుతున్నారు. కంపెనీ సీఈవో కావడానికి ఎంత శ్రమించారో.. సీఈవోగా ఇప్పుడు కంపెనీ వృద్ధికి అంతకన్నా రెంట్టింపుస్థాయిలో పనిచేస్తున్నారు. అయితే ఇటీవల తెచ్చిన చాట్‌జీపీటీతో కాస్త ఇబ్బంది పడినా.. బోర్డు సత్యనాదెళ్లపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసింది. దీంతో ప్రస్తుతం సీఈవోగా ఆయనే కొనసాగుతున్నారు. తాజాగా సత్యనాదెళ్ల జీతం పెరిగింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన 79.1 మిలియన్‌ డాలర్ల వేతనం అందుకోనున్నారు. అంటే మన భారతీయ కరెన్సీలో రూ.664 కోట్లు అన్నమాట ఈ విషయాన్ని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

63 శాతం పెరుగుదల..
2023 ఆర్థిక సంవత్సరంలో సత్యనాదెళ్ల వేతనం 48.5 మిలియన్‌ డాలర్లు. భారత కరెన్సీలో రూ.407 కోట్లు. ఈ ఏడాది సత్య నాదెళ్ల వేతనం 63 శాతం పెరిగింది. దీతో ఆయన 79.1 మిలియన్‌ డాలర్లు.. భారత కరెన్సీలో రూ.667 కోట్లు అందుకోనున్నారు. గత జూన్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మైక్రోసాఫ్ట్‌ గణనీయమైన వృద్ధి సాధించింది. దీంతో కంపెనీ షేర్లు 31. 2 శాతం లాభపడ్డాయి. అలాగే మైక్రోసాఫ్ట్‌ మార్కెట్‌ విలువ 3 ట్రియల్‌ డాలర్లు దాటింది. దీంతో సత్య నాదెళ్ల స్టాక్‌ అవార్డులు 38 మిలియన్‌ డాలర్ల నుంచి 71 మిలియన్‌ డాలర్లకు పెరిగాయి. కృత్రిమే మేధ(ఏఐ) రేసులో రాణించేందుకు కంపునీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే చాట్‌ జీపీటీ మాతృ సంస్థ అయిన ఓపెన్‌ ఏఐలో పెట్టుబడులు పెట్టింది.

నగదు ప్రోత్సహకం..
ఇదిలా ఉంటే.. మైక్రోసాఫ్ట్‌కు అందించిన సేవలకు సత్య నాదెళ్లకు 5.2 మిలియన్‌ డాలర్లు (రూ.43 కోట్లు) నగదు ప్రోత్సాహకం కూడా అందనుంది. ఈమేరు కంపెనీ ఫైలింగ్‌లో తెలిపింది. అయితే ఆయనకు రావాల్సిన 10.7 మిలియన్‌ డాలర్లకంఏ ఇది తక్కువ. ఈ ఆర్థిక సంవత్సరంలో అనేక సైబర్‌ సెక్యూరిటీ ఉల్లంఘనల కారణంగా ప్రోత్సాహకం తగ్గినట్లు తెలుస్తోంది.

వివిధ కంపెనీల సీఈవోల వేతనాలు..
ఇక సీఈవోల వేతనాల విషయానికి వస్తే యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ 2023లో 63.2 మిలియన్‌ డారల్లు(రూ.532 కోట్లు) జీతం పొందారు. చిప్‌ తయారీ కంపెనీ ఎన్విడియా సీఈవో జెన్సన్‌ హువాంగ్‌ 2024లో 34.2 మిలియన్‌ డాలర్లు(రూ.282 కోట్లు) వేతనంగా అందుకుంటున్నారు. మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల 79.1 మిలియన్‌ డాలర్లు(రూ.667 కోట్లు) వేతనంగా అందుకోబోతున్నారు. టెక్‌ కంపెనీల్లో సత్య నాదెళ్లదే అధిక వేతనం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version