Telangana Govt Teachers
Telangana Govt Teachers: రండి.. మా పాఠశాలలో మీ పిల్లలను చేర్పించండి.. మా స్కూల్‌లో ఆ సౌక్యాలు, ఈ సిలబస్.. ఆ ర్యాకు, ఈ సీటు అంటూ ప్రైవేటు విద్యాసంస్థలు ప్రచారం చేయడం చూస్తుంటాం. ఇక కార్పొరేట్ విద్యాసంస్థలు అయితే టీవీ చానెళ్లలో ఒకటి.. ఒకటి… రెండు.. రెండు… మూడు.. మూడు.. అంటూ ఎవరో సాధించిన ర్యాంకులు కొని తాము చదువు చెప్పడం వలనే వచ్చాయని ప్రచారం చేసుకోవడం పరిపాటిగా మారింది. వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే పదుల సంఖ్యలో ర్యాకులు వస్తున్నాయి. వాటిని తమ క్రెడిగ్ ఖాతాలో వేసుకుంటూ అడ్మిషన్లు చేసుకుంటూ లక్షల ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇక నిర్బంధ విద్య, టార్చర్ అదనం. అయితే నాణ్యమైన విద్యాబోధన అందించే ప్రభుత్వ పాఠశాలలో మాత్రం తమ పిల్లలను చేర్పించడానికి పేద, మధ్య తరగతి ప్రజలు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. పేద తల్లిదండ్రులు కూడా తమి పిల్లలను ప్రైవేటులో చదివించాలని ఆలోచిస్తున్నారు. ఇదుకు కారణం ప్రభుత్వ పాఠశాల మారకోవడం, విద్యావిధానంలో మార్పు లేకపోవడం. తెలంగాణ దశాబ్ది సంబురాలు చేసుకుంటున్న కేసీఆర్ సర్కార్ తొమ్మిదేళ్లలో ఏం సాధించింది అంటే మాత్రం పెద్దగా, గొప్పగా చెప్పుకునే విషయాలు ఏమీ లేవు.
కేజీ టూ పీజీ ఉచిత విద్య అని..
తెలంగాణలో కేజీ నుంచి పీజీ వరకు పిల్లలందరికీ ఉచితంగా విద్యను అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఆ పేరుతో పిల్లను కులాల వారీగా విభజించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు అంటూ పసి తనంలోనే కుల గజ్జిని వారిపై రుద్దతున్నారు. ఈ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలతోపాటు, గురుకులాల్లో పర్మినెంట్ ఉపాధ్యాయుల నియామకాన్ని పట్టించుకోవడం లేదు. ఔట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులతో గురుకులాలను నడిపిస్తున్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలలను సర్దుబాటు పేరుతో నెట్టుకొస్తున్నారు.
తగ్గుతున్న అడ్మిషన్లు..
గురుకులాల కారణంగా ప్రభుత పాఠశాలల్లో ఏటా అడ్మిషన్లు తగ్గుతున్నాయి. ఉచిత విద్య, యూనిషాం, పుస్తకాలు, సన్న బియ్యంతో మధ్యాహ్నం భోజనం అందిస్తున్నా.. పిల్లలు చేరడం లేదు. దీంతో ఉపాధ్యాయుల ఉద్యోగాలకే ఎసరు వచ్చే ప్రమాదం నెలకొంది. దీంతో అడ్మిషన్ల కోసం ఉపాధ్యాయులు సొంతంగా ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
బైక్‌పై మైక్‌పెట్టి ప్రచారం..
వరంగల్ జిల్లా రాయపర్తి మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రావుల భాస్కర్‌రావు పిల్లలను చేర్పించేందుకు ప్రభుత్వ పాఠశాలకే రండి పేరుతో వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. తన బైక్‌కు సొంతంగా మైక్ పెట్టుకుని ప్రచారం నిర్వహిస్తున్నాడు. ప్రభుత్వ పాఠశాలలో చేరితే అందే సౌకర్యాలు వివరిస్తున్నాడు.
ప్రభుత్వ బాధ్యత మరువడంతో..
ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచే బాధ్యతను మరిచింది. గురుకులాల్లో ప్రవేశాలకు పోటీ పెరగడంతో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. కానీ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆ బాధ్యత తనది కాదు అన్నట్లు ఉపాధ్యాయులతో మొక్కుబడిగా బడిబాట నిర్వహించి చేతులు దులుపుకుంటోంది. విద్యార్థులు పెరుగుతున్నారా… తగ్గుతున్నారా అనే విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. దీంతో తమ ఉద్యోగాలు కాపాడుకోవడానికి ఉపాధ్యాయులే ఇప్పుడు ఆ బాధ్యతను తీసుకుంటున్నారు.
జగన్‌ను చూసైనా…
తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చి 9 ఏళ్ల గడిచింది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వ విద్య, పాఠశాలల్లో మార్పు తెచ్చింది కొంతే. కానీ జగన్ తాను అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశారు. ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన జరిగేలా ప్రత్యేక దృష్టి పెట్టారు. కేసీఆర్ 9 ఏళ్లలో చేయలేని పనిని జగన్ కేవలం 2 ఏళ్లలోనే చేసి చూపించారు. మరి తెలంగాణలో సర్కార్ పాఠశాలలకు ఎప్పుడు మంచిరోజులువస్తాయో.. కేసీఆర్ ఎప్పుడు నేర్చుకుంటారో ఏమో!
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Teachers are campaigning innovatively to increase admissions in government schools
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com