టీడీపీ వర్సెస్ నిమ్మగడ్డ..?

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై టీడీపీ వైఖరి మళ్లీ మొదటికి వచ్చింది. గత ఏడాది స్థానికసంస్థల ఎన్నికలు వాయిదా వేయకముందు ఎస్ఈసీపై టీడీపీ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.. అప్పట్లో పార్టీల ప్రాతిపదికన చేపట్టిన ఎంపీటీసీ.. జెడ్పీటీసీ.. మున్సిపాలిటీ.. కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు చేసుకోవడాన్ని టీడీపీ జీర్ణయించుకోలేక పోయింది. దీతో ఎస్ఈసీ నిమ్మగడ్డ అసమర్థత వల్లే.. అధికార పార్టీ ఏకగ్రీవాలు చేసుకుందని టీడీపీ విమర్శలు గుప్పించింది. Also Read: టీడీపీని […]

Written By: Srinivas, Updated On : February 16, 2021 1:32 pm
Follow us on


ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై టీడీపీ వైఖరి మళ్లీ మొదటికి వచ్చింది. గత ఏడాది స్థానికసంస్థల ఎన్నికలు వాయిదా వేయకముందు ఎస్ఈసీపై టీడీపీ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.. అప్పట్లో పార్టీల ప్రాతిపదికన చేపట్టిన ఎంపీటీసీ.. జెడ్పీటీసీ.. మున్సిపాలిటీ.. కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు చేసుకోవడాన్ని టీడీపీ జీర్ణయించుకోలేక పోయింది. దీతో ఎస్ఈసీ నిమ్మగడ్డ అసమర్థత వల్లే.. అధికార పార్టీ ఏకగ్రీవాలు చేసుకుందని టీడీపీ విమర్శలు గుప్పించింది.

Also Read: టీడీపీని భయపెడుతున్న మున్సిపల్ ఎన్నికలు..?

కేంద్ర హోంశాఖకు నిమ్మగడ్డ.. రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటే లేఖలు రాయడం ప్రారంభించింది టీడీపీ. అనేక అవాంఛనీయ ఘటనలు ఎస్ఈసీ.. రాష్ర్ట ప్రభుత్వం మధ్య ఈ నేపథ్యంలో చోటు చేసుకున్నాయి. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎస్ఈసీ దూకుడుగా వ్యవహరించడంతో టీడీపీ కూడా ఇంతకాలం నెత్తికెత్తుకుని నిమ్మగడ్డను మోసం చేసింది. ఈ నేపథ్యంలో మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికలకు నిమ్మగడ్డ శ్రీకారం చుట్టారు. మరో ఐదురోజులుల్లో ఇవి ముగుస్తాయి. ఇదే సందర్భంలో మున్సిపల్ ఎన్నికలకు సైతం ఎస్ఈసీ నగారా మెగించారు. అయితే తాము ఆశించినట్లు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను చేపడతారని అనుకున్న టీడీపీకి నిమ్మగడ్డ తీవ్ర నిరాశను మిగిల్చారు.

గతంలో ఎక్కడైతే ఎన్నికల ప్రక్రియ ఆగిందో.. తాజాగా అక్కడి నుంచే చేపట్టనున్నట్లు మున్సిపల్ ఎన్నికల షెడ్యూలు సందర్భంగా ఎస్ఈసీ స్పష్టం చేశారు. నిమ్మగడ్డ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు టీడీపీకి కోపం తెప్పించింది. అలాగే మార్చి 3న మధ్యాహ్నం మూడు గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. దాదాపు మూడు వారాల గడువు ఇవ్వడం టీడీపీకి నచ్చడం లేదు. ఎందుకంటే.. అధికార పార్టీ ప్రలోభాలకు చాలా సమయం ఇచ్చినట్లు అవుతుందని టీడీపీ ఆందోళన చెందుతుంది.

Also Read: మోదీ.. సర్కారువారి పాట ‘2024’

అసలే పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారుల దెబ్బకు ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులు కొట్టుకుపోయారు. అధికార పార్టీతో నిమ్మగడ్డ మరోసారి లోపాయికార ఒప్పందం చేసుకున్నారని టీడీపీ అనుమానం వ్యక్తం చేస్తోంది. పార్టీ రహితంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారుల హవా కొనసాగిస్తున్నారని, ఇక పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికల్లో ఆ ప్రభావం మరింత ఎక్కువ ఉంటుందని, దీంతో అభ్యర్థులు పోటీకి వెనకాడుతారని టీడీపీ ఆందోళన చెందుతుంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్