https://oktelugu.com/

తన ఫోటోలు చూసి నిధి అగర్వాల్ షాక్ !

గ్లామరస్ హీరోయిన్లకు గుడి కట్టడం అనేది చాలా కాలంగా వస్తోన్న ఆనవాయితీ. ముఖ్యంగా తమిళనాడులో ఆ కల్చర్ చాలా ఎక్కువగా ఉంటుంది. గతంలో సీనియర్ బ్యూటీ ఖుష్బూకి, హాట్ బ్యూటీ నమితకు, అలాగే హన్సికకు కూడా వాళ్ళు గుళ్ళు కట్టి పూజలు జరిపిన సంఘటనలు ఉన్నాయి. ఏది ఏమైనా తమిళ సినిప్రియులు ఏమి చేసినా కొత్తగానే ఉంటుంది. తాజాగా ఆ కొత్తదనం మళ్ళీ చూపించారు. హీరోయిన్ నిధి అగర్వాల్ కి గుడి కట్టారు. ఐతే, బాగా పాపులరిటీ […]

Written By:
  • admin
  • , Updated On : February 16, 2021 / 01:47 PM IST
    Follow us on


    గ్లామరస్ హీరోయిన్లకు గుడి కట్టడం అనేది చాలా కాలంగా వస్తోన్న ఆనవాయితీ. ముఖ్యంగా తమిళనాడులో ఆ కల్చర్ చాలా ఎక్కువగా ఉంటుంది. గతంలో సీనియర్ బ్యూటీ ఖుష్బూకి, హాట్ బ్యూటీ నమితకు, అలాగే హన్సికకు కూడా వాళ్ళు గుళ్ళు కట్టి పూజలు జరిపిన సంఘటనలు ఉన్నాయి. ఏది ఏమైనా తమిళ సినిప్రియులు ఏమి చేసినా కొత్తగానే ఉంటుంది. తాజాగా ఆ కొత్తదనం మళ్ళీ చూపించారు. హీరోయిన్ నిధి అగర్వాల్ కి గుడి కట్టారు. ఐతే, బాగా పాపులరిటీ తెచ్చుకున్న హీరోయిన్లకు గుడి కట్టినా ఓకే, కానీ అసలు స్టార్ డమ్ రాని నిధికి కూడా గుడి కట్టడమే ఇక్కడ విచిత్రం.

    Also Read: ఎంట్రీతోనే దుమ్ములేపిన హీరోలు.. ఇందులో మీ స్టార్ ఉన్నారా?

    తమిళ జనానికి నచ్చితే నెత్తిన పెట్టుకోవడమే కాదు పూజలు కూడా చేస్తారు. ఈ క్రమంలో నిధికి కూడా పూజలు చేశారు. ఇప్పటివరకు నిధి తమిళంలో చేసింది రెండు సినిమాలే. కేవలం రెండు సినిమాలతోనే నిధికి ఇంత క్రేజ్ రావడం, వింతగానే ఉంది. తమిళంలో చేసిన రెండు సినిమాలలో ఒకటి ‘భూమి’, రెండోది ‘ఈశ్వరన్’. ఈ రెండూ గత నెలలో విడుదల అయి ప్లాప్ అయ్యాయి. సినిమాలు పెద్దగా సంచలనాలు ఏమి క్రియేట్ చేయకపోయినా.. ముఖ్యంగా ‘ఈశ్వరన్’లో నిధి అందచందాలకు అభిమానులు ఫిదా అయ్యారట.

    Also Read: అవ‌‌స‌రానికి వాడుకుంటారు.. తీరిన‌ త‌ర్వాత ఆడుకుంటారుః అన‌సూయ‌

    మెయిన్ గా హీరో శింబు ఫాన్స్ కి నిధి చాల బాగా నచ్చిందట. దాంతో, ఆమెకి చెన్నైలో గుడి కట్టి, పాలాభిషేకాలు జరిపారు శింబు ఫ్యాన్స్. ఇక సోషల్ మీడియాలో ఈ ఫోటోలు చూసి షాక్ తిన్నాను అంటోంది నిధి అగర్వాల్. ఇంత క్రేజ్ వస్తుందని అనుకోలేదని తెగ మురిసిపోతోంది. ఇక తెలుగులో ‘ఇస్మార్ట్ శంకర్’తో పాపులర్ అయిన నిధి అగర్వాల్ రీసెంట్ గా బాలీవుడ్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్