TDP Trolls: ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అంటున్న టీడీపీ..!

TDP Trolls:  వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావొస్తుంది. 2019 ఎన్నికల్లో ‘అఖండ’ మెజార్టీతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి తుఫానును సృష్టించడంతో టీడీపీ బొక్కాబొర్లా పడింది. కేవలం 23 సీట్లకే పరిమితమైన టీడీపీలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారనేది కూడా ఖచ్చితంగా చెప్పడం కూడా కష్టమే. ప్రస్తుతం ఆపార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు మినహా మిగిలిన వాళ్లంతా సైలెంట్ గానే ఉంటున్నారు. ఈక్రమంలోనే టీడీపీ క్రమంగా బలహీనమవుతుందనే […]

Written By: NARESH, Updated On : December 7, 2021 11:33 am
Follow us on

TDP Trolls:  వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావొస్తుంది. 2019 ఎన్నికల్లో ‘అఖండ’ మెజార్టీతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి తుఫానును సృష్టించడంతో టీడీపీ బొక్కాబొర్లా పడింది. కేవలం 23 సీట్లకే పరిమితమైన టీడీపీలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారనేది కూడా ఖచ్చితంగా చెప్పడం కూడా కష్టమే. ప్రస్తుతం ఆపార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు మినహా మిగిలిన వాళ్లంతా సైలెంట్ గానే ఉంటున్నారు.

TDP Trolls

ఈక్రమంలోనే టీడీపీ క్రమంగా బలహీనమవుతుందనే సంకేతాలు క్యాడర్లోకి వెళుతున్నాయి. ఇదే సమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎక్కడా ఎలాంటి ఎన్నిక జరిగినా కూడా ఆపార్టీనే ఘనవిజయం సాధిస్తూ వెళుతోంది. దీంతో అధికారంలో ఉన్న వైసీపీనీ టీడీపీ ఎదుర్కోలేక చతికిలబడుతోంది. ఇలాంటి సమయంలో టీడీపీ సోషల్ మీడియా మళ్లీ యాక్టివ్ అవుతోంది. తాాజాగా ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అంటూ వైసీపీ హిట్ సాంగ్ ను టీడీపీ శ్రేణులు ట్రెండింగులోకి తీసుకొస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయం నుంచి ఆపార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు ఈ పాట ఏపీలో మార్మోగిపోయింది. ప్రజల మూడ్ ను వైసీపీ మరల్చడంలో ఈ పాట కొంత ప్రభావం చూపిందనే చెప్పొచ్చు. అయితే ఇదే పాటను టీడీపీ తన ప్రత్యర్థి వైసీపీపై అస్త్రంగా ప్రయోగిస్తోంది. జగన్ సర్కారు వైఫల్యాలు కళ్ళకు కట్టేలా చూపించేలా టీడీపీ సోషల్ మీడియా ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అనే పాటను ట్రోల్స్ రూపంలో వాడుతోంది.

తాజాగా తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా తెనాలి పట్టణంలో ఉన్న పార్కుల్లో అక్కడికి వచ్చే వారి సౌకర్యార్థం మూడు బెంచీలను ఏర్పాటు చేశారు. ఈ మూడు బెంచీలపై సీఎం వైఎస్ జగన్ మోహన్మోన్ రెడ్డి, ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ఫోటోలను ఏర్పాటు చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బెంచ్ పై కొబ్బరికాయ కొట్టి మరీ ప్రారంభించి కాసేపు ఆ బల్లలపై సేదతీరారు.

ఈ అంశాన్నే టీడీపీ సోషల్ మీడియా కార్నర్ చేస్తూ తెగ ట్రోల్స్ చేస్తోంది. తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే ప్రారంభించిన ఓ భారీ ప్రాజెక్టు ఇదేనంటూ టీడీపీ నేతలు చెబుతున్చెనారు. ఇది చాలా పెద్ద ఓపెనింగ్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. సీఎం జగన్, ఎమ్మెల్యే రేంజ్ లకు తగ్గట్గుగా మూడంటే మూడు బెంచీలను ఏర్పాటు చేశారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

Also Read: ఎన్టీఆర్ కు వెన్నుపోటు: బాలయ్య కన్నీళ్లకు అర్థం ఉందా?

వైసీపీ నేతలు అసెంబ్లీలో ఉత్త వెకిలి నవ్వులే కాకుండా.. పార్కుల్లో బెంచీల్లాంటివి కూడా ఏర్పాటు చేయడం గర్వకారణంగా ఉందంటూ టీడీపీ అధికారిక ట్వీటర్ హ్యాండిల్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన పిక్స్ పెట్టి మరీ ట్రోల్స్ చేస్తున్నారు.

టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు ఇండస్ట్రీయల్ పార్కులను ప్రారంభిస్తే నేడు వైఎస్ జగన్ హయాంలో ఎమ్మెల్యే బెంచీలు, బల్లలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. దీంతో మరోసారి వైసీపీ హిట్ సాంగ్ సోషల్ మీడియాలో సెటైరికల్ గా ట్రెండింగ్ అవుతోంది. దీనిపై వైసీపీ నేతలు ఎలా కౌంటర్ ఇస్తారో వేచిచూడాల్సిందే..!

Also Read: ఇంటి దొంగల పని పట్టనున్న టీడీపీ?