ఈసారి వృద్ధులకు నో చాన్స్?

ఏ పనికి అయినా యువకులనే తీసుకుంటారు. ఒక్క రాజకీయాల్లోనే తలపండిన వారినే మేధావులుగా భావిస్తారు. వారినే ఎన్నికల్లో గెలిపిస్తారు. దీంతో ఇన్నాళ్లు వృద్ధులే రాజకీయం చేస్తున్నారు. రాజకీయాల్లో నిలదొక్కుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీల్లో వారిదే ఆధిపత్యం కనబడేది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. కాలం చెల్లిన వారికి రాజకీయాల్లో ప్రవేశం దక్కడం లేదు. ఫలితంగా వైసీపీలో అందరూ యాభై ఏళ్ల కంటే తక్కువ ఉన్న వారే. దీంతో దాని ప్రభావం టీడీపీపై కూడా పడుతోంది. టీడీపీలో కూడా […]

Written By: Srinivas, Updated On : June 4, 2021 8:51 am
Follow us on

ఏ పనికి అయినా యువకులనే తీసుకుంటారు. ఒక్క రాజకీయాల్లోనే తలపండిన వారినే మేధావులుగా భావిస్తారు. వారినే ఎన్నికల్లో గెలిపిస్తారు. దీంతో ఇన్నాళ్లు వృద్ధులే రాజకీయం చేస్తున్నారు. రాజకీయాల్లో నిలదొక్కుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీల్లో వారిదే ఆధిపత్యం కనబడేది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. కాలం చెల్లిన వారికి రాజకీయాల్లో ప్రవేశం దక్కడం లేదు. ఫలితంగా వైసీపీలో అందరూ యాభై ఏళ్ల కంటే తక్కువ ఉన్న వారే. దీంతో దాని ప్రభావం టీడీపీపై కూడా పడుతోంది. టీడీపీలో కూడా వృద్ధ నేతలను పక్కకు పెట్టనున్నారు.

తెలుగుదేశంలో అందరూ అరవై సంవత్సరాల వారే కనిపిస్తున్నారు. దీంతో టీడీపీ మొత్తం వృద్ధ టీంగా తయారయింది.దీంతో అధినేత వారితో ఏ పని చేయలేకపోతున్నారు. జనాలతో కనెక్ట్ కావడం ఇబ్బందిగా పరిణమిస్తోంది. దీంతో బాబు సైతం వచ్చే ఎన్నికల్లో వృద్ధులకు టాటా చెప్పి యువ నేతలకే టికెట్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

2014 నుంచి 2019 దాకా చంద్రబాబు వృద్ధ జపాన్ని వల్లించారు. దీంతో ఫలితం అనుభవించారు. ఓటమిని చవిచూశారు. ఓటర్లు మాత్రం వయసుకు ప్రాధాన్యం ఇవ్వలేదు. యువనేతలకే పట్టం కట్టారు. వైసీపీకే మొగ్గు చూపారు. చంద్రబాబు ప్రయోగం విఫలమైంది. రెండు పార్టీలు వృద్ధులను పక్కకు పెట్టడంతో వారి ప్రస్థానం ముగిసినట్లే. ఇక ఇంట్లో కూర్చుని కృష్ణా, రామ అనుకోవాల్సిందే.

వైసీపీ మార్గంలో చంద్రబాబు కూడా నడవనున్నారు. 2024 ఎన్నికల్లో యువ రక్తానికే ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది. దీంతో తలపండిన వారి పని అయినట్లే. ఇంక వారు ఇంటికే పరిమితం. ఇన్నాళ్లు పార్టీలను ముప్పతిప్పలు పెట్టినా ఏదో పెద్దవారులే అనే ఉద్దేశంతో భరించిన పార్టీలకు ఇప్పుడు యువరక్తం ఓ కిక్ లా అనిపిస్తోంది.