https://oktelugu.com/

ఇక చాలు.. రాజకీయాలకు మురళీమోహన్ గుడ్ బై..

మొదట సినీ ఇంస్ర్టీకి రావడం.. తరువాత ఓ వెలుగు వెలిగాక.. రాజకీయాల వైపు ఆసక్తి చూపడం.. అక్కడ అడుగు పెట్టాక.. పొలిటికల్ జీవితాన్ని అనుభవించడం.. తరువాత వద్దనుకుని విశ్రాంతి తీసుకోవడం ఇలా చాలామంది సినీ స్టార్లు.. ఇదే బాటలో నడుస్తున్నారు. అక్కడ కలిసొచ్చినా.. రాకున్నా.. రుచి చూసి సైడైపోతున్నారు. కొంతకాలం పోయాక.. అనుభవం వచ్చాకా.. బాబోయ్ మాకొద్దు ఈ రాజకీయాలు అంటూ.. గుడ్ బై చెబుతున్నారు. Also Read: జగన్ ఇంట ‘షర్మిల’ కొత్త పార్టీ చిచ్చు.. […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 25, 2021 / 01:22 PM IST
    Follow us on


    మొదట సినీ ఇంస్ర్టీకి రావడం.. తరువాత ఓ వెలుగు వెలిగాక.. రాజకీయాల వైపు ఆసక్తి చూపడం.. అక్కడ అడుగు పెట్టాక.. పొలిటికల్ జీవితాన్ని అనుభవించడం.. తరువాత వద్దనుకుని విశ్రాంతి తీసుకోవడం ఇలా చాలామంది సినీ స్టార్లు.. ఇదే బాటలో నడుస్తున్నారు. అక్కడ కలిసొచ్చినా.. రాకున్నా.. రుచి చూసి సైడైపోతున్నారు. కొంతకాలం పోయాక.. అనుభవం వచ్చాకా.. బాబోయ్ మాకొద్దు ఈ రాజకీయాలు అంటూ.. గుడ్ బై చెబుతున్నారు.

    Also Read: జగన్ ఇంట ‘షర్మిల’ కొత్త పార్టీ చిచ్చు.. అసలు నిజం ఏంటి?

    ఇలా మెగాస్టార్ చిరంజీవి గత కొంతకాలంగా రాజకీయాలపై విముఖంగానే ఉన్నారు. రజినీకాంత్ కూడా మొదట రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేయాలని ఆలోచించి.. తరువాత వద్దని ముందు జాగ్రత్త పడాడరు. ఈ క్రమంలో రాజమండ్రి నుంచి పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన మురళీ మోహన్ సైతం కొద్దిరోజులుగా ‘మనకెందుకులెండీ.. ఈ రాజకీయాలు’ అంటూ.. నిరాశక్తత ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తున్నారు.

    Also Read: జగనన్న బాణం.. యూటర్న్..?

    నటుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా మంచి పేరు గడించిన మురళీ మోహన్ ఆ తరువాత రాజకీయాల్లో చేరారు. ఉమ్మడి రాష్ట్రం, ఏపీ రాజకీయాల్లో క్రీయాశీలకంగా పనిచేశారు. రాజమండ్రి నుంచి పార్లమెంటు అభ్యర్థిగా.. పోటీ చేసి ఓసారి ఓడిపోయారు. మరోసారి గెలుపొందారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయాక… ఆయన రాజకీయంగా పూర్తిగా సైడ్ అయిపోయారు. దాదాపు రెండేళ్లుగా ఆయన నోటినుంచి రాజకీయం అన్న మాటే రావడం లేదు. ఇప్పడు ఏకంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    కాగా.. ఇటీవల మురళీ మెహన్ అనారోగ్యం పాలయ్యారు. ఆపరేషన్ కూడా జరిగింది. ఆరోగ్య కారణాల రిత్యా.. రాజకీయాలకు దూరం అయ్యానంటున్న మురళీ మోహన్.. ఇప్పడు మళ్లీ సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు. అతడు లాంటి సినిమాలను అందించిన జయభేరి సంస్థ నుంచి కొత్త సినిమాలను రూపొందించడానికి కసరత్తు చేస్తున్నారు. అంతేకాదు.. నటుడిగా తాను మళ్లీ రంగ ప్రవేశం చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆర్కే మీడియా రూపొందిస్తున్న ఓ వెబ్ సిరీస్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు.