తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. రోజుకురోజుకు కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. హైదరాబాద్లో సంపూర్ణ లాక్డౌన్ విధించాలని నగర వాసులు కోరుతుండటంతో ప్రభుత్వం కూడా ఆ దిశగా సన్నహాలు చేసింది. లాక్డౌన్ నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కొలుకుంటున్న సమయంలో మరోసారి సంపూర్ణ లాక్డౌన్ విధిస్తే పరిస్థితులు మరింత దిగజారుతాయని ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు ప్రభుత్వం హైదరాబాద్ సంపూర్ణ లాక్డౌన్ విధిస్తే ప్రభుత్వం కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందనే సంకేతం ప్రజల్లో వెళుతుందని గ్రహించిన ప్రభుత్వం తమ ఆలోచనను చివరి నిమిషంలో మార్చుకుందని సమాచారం.
జగన్ ని తిట్టే బాధ్యత పవన్ ఎలా నెరవేర్చుతాడో?
హైదరాబాద్లో లాక్డౌన్ విధిస్తే ఆ ప్రభావం రాష్ట్ర ఖాజానాపై పడనుంది. దీని వల్ల మళ్లీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే గడిచిన మూడునెలలుగా ప్రభుత్వ ఉద్యోగులు సగం జీతాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోసారి లాక్డౌన్ విధిస్తే అన్నివర్గాల ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ప్రజలకు ఉపాధి లేకపోతే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే ప్రమాదం లేకపోలేదు. మరోవైపు సంపూర్ణ లాక్డౌన్ వల్ల పోలీస్ శాఖపై మరింత పని ఒత్తిడి పెరుగుతుంది. అంతే కాకుండా కరోనా కట్టడికి లాక్‌డౌన్ మాత్రమే ప్రత్యామ్నాయం కాదనే ప్రభుత్వం భావిస్తోంది.
హైదరాబాద్లో ప్రభుత్వం లాక్డౌన్ విధించకపోయినపోయినప్పటికీ వ్యాపారులే స్వచ్చంధంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. వినియోగదారుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వ్యాపార సంఘాల ఆధ్వర్యంలో మార్కెట్లను మూసీవేస్తున్నారు. చాలాచోట్ల తక్కువ సమయమే దుకాణాలను తెరుస్తున్నారు. ప్రజలే స్వచ్చంధంగా లాక్డౌన్ పాటిస్తున్న తరుణంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించే అవసరం లేదని భావిస్తుంది. హైదరాబాద్‌లో కేసులు భారీగా పెరుగుతున్నా మరణాల రేటు తక్కువగా ఉండటం వల్లే లాక్‌డౌన్ అవసరం లేదని నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు సమాచారం. తాజాగా కరోనా టెస్టులు పెంచుతుండటంతోనే సంఖ్య ఎక్కువగా వస్తోందని.. దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతోన్నారు.
కొత్త సచివాలయ నిర్మాణంపై కేసీఆర్ వ్యూహమేంటి?
అయితే హైదరాబాద్ ప్రభుత్వం సంపూర్ణ లాక్డౌన్ విధిస్తుందనే ప్రచారం నేపథ్యంలో ఇప్పటికే చాలామంది సొంతూళ్లకు తరలివెళుతున్నారు. దీంతో హైదరాబాద్-విజయవాడ హైవే రద్దీగా మారింది. తెలంగాణ-ఏపీ సరిహద్దుల్లో కిలోమీటర్ల కొద్ది వాహనాలు భారీగా నిలిచిపోయాయి. నగరవాసులు నుంచి పెద్దఎత్తున విజ్ఞఫ్తులు రావడంతో తొలుత హైదరాబాద్లో సంపూర్ణ లాక్డౌన్ విధించాలని ప్రభుత్వం భావించినప్పటికీ చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నట్లు సమాచారం. అయితే ప్రభుత్వం లాక్‌డౌన్ విధించినా.. విధించకపోయినా కరోనాపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.