https://oktelugu.com/

బాబు హెచ్చరికలు పట్టించుకోని నేతలు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలవడానికి కావాల్సిన బలాబలాలను బేరీజు వేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణమేమిటనే విసయాలపై చర్చిస్తున్నారు. పార్టీ నాయకత్వంపై సలహాలు, సూచనలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిస్తున్నారు. ఇందులో భాగంగా బలహీనంగా ఉన్న నేతలు తమ ప్రాంతాలపై ప్రధాన దృష్టి కేంద్రీకరించాలని చెబుతున్నారు. ఎవరైనా ఉపేక్షిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. వ్యాపారాలు […]

Written By:
  • NARESH
  • , Updated On : May 19, 2021 / 09:10 AM IST
    Follow us on

    తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలవడానికి కావాల్సిన బలాబలాలను బేరీజు వేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణమేమిటనే విసయాలపై చర్చిస్తున్నారు. పార్టీ నాయకత్వంపై సలహాలు, సూచనలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిస్తున్నారు. ఇందులో భాగంగా బలహీనంగా ఉన్న నేతలు తమ ప్రాంతాలపై ప్రధాన దృష్టి కేంద్రీకరించాలని చెబుతున్నారు. ఎవరైనా ఉపేక్షిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు.

    వ్యాపారాలు చేసుకుంటూ..
    గత ఎన్నికల్లో పెట్టిన ఖర్చులకు కుదేలయిపోయామని పార్టీ నేతలు చంద్రబాబు ముందు వాపోయారు. ప్రస్తుతం ఏం చేయాలో తెలియక హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్లి వ్యాపారం చేసుకుంటున్నామని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టే అవకాశాలు లేవని తేల్చి చెప్పారు. దీంతో చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పని చేయాల్సిందేనని హుకుం జారీ చేశారు. దీంతో నేతలు సైతం అంతే స్థాయిలో స్పందించి తమ బతుకు ఎలా అని ప్రశ్నించారు.

    ప్రజల్లో ఉంటేనే..
    ప్రజల్లో ఉంటేనే గుర్తింపు ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో నేతలు సైతం ఇప్పటి నుంచే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే తమ బతుకు దెరువు ఎలా అని ప్రశ్నిస్తున్నారు. దీనికి చంద్రబాబు ప్రజల్లో ఉంటేనే కదా వారు ఓట్లు వేసేది. చివరకు వచ్చి మాకు ఓటు వేయాలంటే ఎవరూ వేయరు. మళ్లీ పాత కథే పునరావృతం అవుతుందని చెప్పారు. అందుకే ఇప్పటి నుంచే ప్రజల వద్దకు వెళ్లాలని సూచించారు.

    ప్రత్నాయం చూసుకోండి
    పార్టీలో యాక్టివ్ గా లేని వారు ప్రత్యామ్నాయం చూసుకోండని హితవు పలికారు. ప్రజలతో సత్సంబంధాలు లేకపోతే విజయం కష్టమని అలాంటి వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. మొహమాటం లేదని పేర్కొన్నారు. పని చేస్తేనే ఉండండి లేదంటే వెళ్లిపోండని హెచ్చరించారు. దీంతో బాబు వార్నింగ్ కు ఎవరు భయపడినట్లు కనిపించలేదని తెలుస్తోంది.