https://oktelugu.com/

Bhuma Akhila Priya to Join Janasena: వైసీపీ, టీడీపీ అయిపోయింది.. ఇక జనసేనలో ‘అఖిలప్రియ’ రాజకీయం

Bhuma Akhila Priya to Join Janasena: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ జనసేనలోకి వెళ్తున్నట్లు ప్రచారం సాగుతోంది. టీడీపీలో తగిన ఆదరణ లేదని అలక బూనినట్లు తెలుస్తోంది. అపాయింట్ మెంట్ అడిగినా పట్టించుకోకపోవడంతో ఆమె పార్టీ మారనున్నట్లు చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న అఖిలప్రియ పార్టీ మార్పుపై పలు కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె జనసేనలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మనస్తాపంతోనే పార్టీ మారనున్నట్లు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అఖిలప్రియ (Bhuma Akhila Priya to Join […]

Written By:
  • Neelambaram
  • , Updated On : October 8, 2021 / 03:07 PM IST
    Follow us on

    Bhuma Akhila Priya to Join Janasena: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ జనసేనలోకి వెళ్తున్నట్లు ప్రచారం సాగుతోంది. టీడీపీలో తగిన ఆదరణ లేదని అలక బూనినట్లు తెలుస్తోంది. అపాయింట్ మెంట్ అడిగినా పట్టించుకోకపోవడంతో ఆమె పార్టీ మారనున్నట్లు చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న అఖిలప్రియ పార్టీ మార్పుపై పలు కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె జనసేనలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మనస్తాపంతోనే పార్టీ మారనున్నట్లు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

    అఖిలప్రియ (Bhuma Akhila Priya to Join Janasena)వ్యవహారంలో టీడీపీ పట్టుదలగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బాబు, లోకేష్ ఎవరు కూడా ఆమెను దగ్గరకు తీసుకోకపోవడంతోనే ఆమె పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె జనసేనలోకి మారితే తనకు కలిసొస్తుందనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భర్త, తమ్ముడితో కలిసి అఖిలప్రియ పలు వివాదాల్లో చిక్కుకున్నట్లు ఆరోపణలు రావడంతోనే ఆమెను పక్కన పెడుతున్నట్లు తెలుస్తోంది.

    రాబోయే 2024 ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇవ్వడం అనుమానమే. దీంతో ఆమె జనసేనలో చేరి తన భవిష్యత్ ను మార్చుకోవలని చూస్తోంది. ఇందులో భాగంగా జనసేన పార్టీ వైపు చూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. గతంలో తన తల్లిదండ్రులు ప్రజారాజ్యంలో కీలక పదవులు అలంకరించి వారితో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్న నేపథ్యంలో ఆమె జనసేనలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

    మరోవైపు ఆమె నియోజకవర్గంలో బలిజ కులస్తులు ఎక్కువగా ఉండడంతో వారి ఓటు బ్యాంకు కీలకం కావడంతో రాజకీయంగా ఎదుగుదలకు తోడ్పడుతుందనే అభిప్రాయంతో ఆమె ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అఖిలప్రియ భవిష్యత్ పై ఆశతోనే పార్టీ మారేందుకు ముందుచూపుతో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో వైసీపీలో ఉన్నప్పుడు కూడా తనను వాడుకుని పావుగా వాడుకుందని వాపోతోంది. అందుకే ఈ పార్టీలను విడిచిపోతున్నట్లు తెలుస్తోంది.