
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి నడుస్తోంది. అటు ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ వెంటనే దుబ్బాక ఉప ఎన్నిక.. తదుపరి గ్రేటర్ ఎలక్షన్స్. పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే గ్రేటర్ ఎలక్షన్లు మరో నెలన్నరలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పటి నుంచే పార్టీలు గ్రేటర్‌పై వాలిపోయాయి. ప్రజల్లో తిరుగుతూ తమ ఉనికిని చాటే ప్రయత్నం చేస్తున్నాయి.
Also Read: జగన్ ఆ వ్యాధితో బాధ పడుతున్నారన్న చినబాబు..?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగైంది. అయితే.. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల బరిలో దిగేందుకు సమయాత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. అప్పుడే పార్టీ తరఫున సన్నాహాలు కూడా ప్రారంభించారట. గతంలో మేయర్ పీఠానికి పోటీ కాకకపోయినా… ప్రతిపక్షంగా హైదరాబాద్ సిటీలో టీడీపీ ఉండేది. ప్రతీవార్డులోనూ బలమైన క్యాడర్ ఉండేది. కానీ రాష్ట్ర విభజన అనంతర పరిణామాలతో క్యాడర్ అంతా టీఆర్ఎస్ వైపు చేరిపోయింది. కానీ టీఆర్ఎస్‌లో వర్గ పోరు.. చోటు దక్కక.. దక్కినా ప్రాధాన్యత దొరకదని భావించిన కొంత మంది ఇంకా టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఇలాంటి వారితో.. టీడీపీ కార్పొరేటర్ టిక్కెట్ల కోసం భారీ డిమాండ్ ఏర్పడటం ఖాయమని అంచనా వేస్తున్నారు.
అయితే.. హైదరాబాద్ సిటీ అభివృద్ధి టీడీపీతోనే జరిగిందని, ఆ అభిమానం ప్రజల్లో ఇప్పటికీ ఉందని తెలుగుదేశం పార్టీ నేతలు భావిస్తున్నారు. దీనికితోడు సెటిలర్ల ఓటు బ్యాంకు కూడా టీడీపీకే ఉంటుంది. వీటిని కీలకం చేసుకొని అందరూ టీడీపీని బలపరుస్తారని నమ్ముతున్నారు.గ్రేటర్ పరిధిలో ఉన్న 150 డివిజన్లలో కనీసం 60 చోట్ల బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు తమ్ముళ్లు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో హైదరాబాద్‌లో తమ పార్టీకి ఏపాటి బలం ఉందో నిరూపించకుంటే భవిష్యత్ మరింత వెలుగుమయం అవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. లేదంటే పూర్తిగా ఉనికి కోల్పోతుందనే చెప్పాలి.
Also Read: చంద్రబాబు జోస్యం: 2022లో జమిలీ ఎన్నికలట..?
గత ఎన్నికలను ఒకసారి పరిశీలిస్తే.. నాటి ఎలక్షన్లలో టీడీపీ ఒక్క సీటుకే పరిమితమైంది. తర్వాత పరిణామాల మధ్య ఆయన కూడా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. కాంగ్రెస్‌కు, బీజేపీకి కూడా సింగిల్ డిజిటే లభించాయి. ఈసారి పరిస్థితి మారుతుందని.. అంత ఏకపక్షంగా ఉండదని టీడీపీ భావిస్తోంది. అందుకే.. రంగంలోకి దిగాలని నిర్ణయించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి పేరుతో అందరూ కలిసి పోటీ చేశారు. ఈసారి అలాంటి ఆలోచనలు లేవు కాబట్టి.. టీడీపీ సొంతంగా రంగంలోకి దిగడానికి ఎలాంటి మొహమాటాలు పెట్టుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఎంతో చాలెంజ్‌గా తీసుకొని టీడీపీ ఎన్నికల్లో పోటీకి దిగినా ప్రాబల్యం చాటకుంటే మొదటికే మోసం వచ్చే అవకాశాలూ ఉన్నాయి. చివరగా టీడీపీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి
Comments are closed.