టీడీపీకి షాక్‌ తగలనుందా..?

ఒకప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు వలసలను ప్రోత్సహించారు. వైసీపీని ఖాళీ చేస్తూ జగన్‌ ఇబ్బందుల పాల్జేశారు. ఇప్పుడంతా సీన్‌ రివర్స్‌. జగన్‌ అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ఆయనా టీడీపీ కార్యకర్తలకు వైసీపీ కండువాలు కప్పుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీకి వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా.. చంద్రబాబు సొంత జిల్లాలోనే ఆయన పార్టీకి చావు దెబ్బ తగిలే పరిస్థితి వచ్చింది. ఇటీవల టీడీపీ విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి […]

Written By: NARESH, Updated On : September 25, 2020 9:55 am
Follow us on

ఒకప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు వలసలను ప్రోత్సహించారు. వైసీపీని ఖాళీ చేస్తూ జగన్‌ ఇబ్బందుల పాల్జేశారు. ఇప్పుడంతా సీన్‌ రివర్స్‌. జగన్‌ అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ఆయనా టీడీపీ కార్యకర్తలకు వైసీపీ కండువాలు కప్పుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీకి వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా.. చంద్రబాబు సొంత జిల్లాలోనే ఆయన పార్టీకి చావు దెబ్బ తగిలే పరిస్థితి వచ్చింది.

ఇటీవల టీడీపీ విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఆయన కొడుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి వైసీపీకి మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించాడు. తాజాగా మరో టీడీపీ నేత కుటుంబం వైసీపీకి జై కొట్టడానికి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే అది చంద్రబాబు సొంత జిల్లాలోనే కావటం గమనార్హం. టీటీడీ మాజీ చైర్మన్, మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడు కుమారుడు డీకే శ్రీనివాసులు తిరుమలలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన పార్టీ మారుతున్నరన్న సంకేతాలను ఇస్తోంది.

డీకే శ్రీనివాసులు జగన్‌ను కలవడంతో ఇప్పుడు అందరి చూపు శ్రీనివాసులు మీద పడింది.వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, డీకే శ్రీనివాసులును పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. ఇందుకు సీఎం జగన్‌ కూడా మిథున్ రెడ్డినే రంగంలోకి దింపారు. గత ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా డీకే శ్రీనివాసులు పోటీ చేస్తారు అని అందరూ భావించినా, అప్పుడు శ్రీనివాసులు తల్లి సత్యప్రభ ఎన్నికల బరిలోకి దిగారు. రాజంపేట నుంచి పోటీ చేసిన ఆమె మిథున్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు.

నాటి నుంచి సైలెంట్‌గా ఉన్న డీకే కుటుంబం తాజాగా డీకే శ్రీనివాసులు జగన్‌ను కలవడంతో పార్టీ మారుతున్నారన్న ప్రచారం బాగా జరుగుతోంది. అయితే జగన్ తో భేటీ అయిన శ్రీనివాసులు ఆనంద నిలయం అనంత స్వర్ణమయం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలన్నదే తన తండ్రి ఆదికేశవులు చివరి కోరిక అని, అది రాజకీయ కారణాలతో పూర్తి కాలేదని, దానిపై సీఎం జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. అంతకు మించి పార్టీ మార్పుపై ఎలాంటి చర్చ జరగలేదని చెప్పారు. తన రాజకీయ భవిష్యత్ విషయంలో తర్వాత నిర్ణయం తీసుకుంటానని, ఆ విషయం తర్వాత మాట్లాడతానని చెప్పారు.

డీకే ఆది కేశవులు కుటుంబం తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లాలో కీలకంగా వ్యవహరించింది. డీకే ఆదికేశవులు నాయుడు రెండుసార్లు టీటీడీ చైర్మన్‌గా, రెండుసార్లు చిత్తూరు ఎంపీగా పనిచేశారు. ఆయన మరణానంతరం ఆయన సతీమణి డీకే సత్యప్రభ 2014 ఎన్నికల్లో పోటీ చేసి చిత్తూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఓటమి పాలయ్యారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో టీడీపీకి షాక్ ఇచ్చి వైసీపీకి జై కొట్టాలని డీకే కుటుంబం చూస్తున్నట్లుగా సమాచారం.