sp balu
బాల సుబ్రహ్మణ్య ఆరోగ్య పరిస్థితిపై తాజాగా ఎంజీఎం ఆస్పత్రి బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో ఎస్పీ బాలు ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
ప్రస్తుతం ఎస్పీ బాలుకు ఎక్మో, వెంటిలేటర్ ఇతర ప్రాణధార చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. కాగా కోలుకున్నట్టే కోలుకొని మళ్లీ బాలు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారడం అందరినీ కలవరపాటుకు గురిచేస్తోంది.