https://oktelugu.com/

టీడీపీ నిధుల వేట..: ముందుకు రాని క్యాడర్‌‌

దశాబ్దాల పొలిటికల్‌ కెరియర్‌‌.. పలు టర్మ్‌లు రాష్ట్రాలకు సీఎంగా సేవలందించిన నేత. ఆయనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. మరి ఇంత అనుభవం ఉన్న ఆ లీడర్‌‌ ఎదైనా ఎత్తు వేస్తే అది కచ్చితంగా సక్సెస్‌ కావాలి. కానీ.. అదేంటో ఏజ్‌ పెరుగుతున్న కొలదీ ఆయనలోని రాజకీయం కోణం కొంచెం కొంచెం కనుమరుగు అవుతున్నట్లు కనిపిస్తోంది. ఆయన ఎత్తులు ఎక్కడా పనిచేయడం లేదు. Also Read: విశాఖ స్టీల్ ప్లాంట్ పై జగన్ సర్కార్ సంచలన […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 8, 2021 / 10:32 AM IST
    Follow us on


    దశాబ్దాల పొలిటికల్‌ కెరియర్‌‌.. పలు టర్మ్‌లు రాష్ట్రాలకు సీఎంగా సేవలందించిన నేత. ఆయనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. మరి ఇంత అనుభవం ఉన్న ఆ లీడర్‌‌ ఎదైనా ఎత్తు వేస్తే అది కచ్చితంగా సక్సెస్‌ కావాలి. కానీ.. అదేంటో ఏజ్‌ పెరుగుతున్న కొలదీ ఆయనలోని రాజకీయం కోణం కొంచెం కొంచెం కనుమరుగు అవుతున్నట్లు కనిపిస్తోంది. ఆయన ఎత్తులు ఎక్కడా పనిచేయడం లేదు.

    Also Read: విశాఖ స్టీల్ ప్లాంట్ పై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం

    ఏపీలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల సీజన్‌ నడుస్తోంది. అయితే.. రాష్ట్రంలో ఏకగ్రీవ ఎన్నికల కోసం వైసీపీ ప్రభుత్వం ఎక్కువగా మొగ్గు చూపుతోంది. అనేక చోట్ల పంచాయతీల్లో వేలం నిర్వహించి ఎన్నికలను ఏకగ్రీవం చేసుకుంటున్నారు. అధికార పార్టీ వైసీపీ దెబ్బకు టీడీపీ నేతలు ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీ ఎన్నికలు గ్రామ స్థాయిలో హోరాహోరా జరుగుతున్న సమయంలో నిధుల సమస్య టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. ఇరవై నెలలుగా టీడీపీ నేతలు నియోజకవర్గాలకు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన టీడీపీ అభ్యర్థులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాము అసెంబ్లీ ఎన్నికలకు ఖర్చుతో అప్పులు ఊబిలో ఇరుక్కుపోయామని ఇప్పటికే టీడీపీ నేతలు కేంద్ర నాయకత్వానికి చెబుతున్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నందున ఇప్పుడిప్పుడే తమపై ఎలాంటి ఖర్చులను రుద్దవద్దని కొందరు నేతలు మొహమాటం లేకుండానే చెబుతున్నారు.

    మరి.. పంచాయతీ ఎన్నికలంటే ఒకటి కాదు రెండు కాదు.. వందల సంఖ్యలో పంచాయతీలు ఉంటాయి. ఇక్కడ టీడీపీ సానుభూతిపరుడిని బరిలోకి దింపాలంటే లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. నిజానికి టీడీపీలో చాలా మంది నేతలు పంచాయతీ ఎన్నికలను ఇప్పుడు కోరుకోలేదు. కానీ.. అనివార్యంగా ఆ ఎన్నికలు వచ్చేశాయి. గ్రామ స్థాయిలో వైసీపీ బలంగా ఉండటంతో ముందు ముందు మరింత బలహీనమవుతామన్న ఆందోళన టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది.

    Also Read: షర్మిల పార్టీ కేసీఆర్ స్కెచ్ యేనా? బీజేపీని చీల్చడానికా?

    ఇప్పటికే కొందరు టీడీపీ మద్దతుదారులు మాజీ ఎమ్మెల్యేల వద్దకు వచ్చి వాపోతున్నారు. తాము నామినేషన్లను వేయలేమని, ఆర్థికంగా ఆదుకుంటే తప్ప ముందుకు వెళ్లలేమని చెబుతున్నారు. ప్రధానంగా రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఈ పరిస్థితి ఉందని టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఆ ప్రాంత నేతల నుంచి సమాచారం వచ్చింది. దీంతో చంద్రబాబు నేతలకు ఎంత హితబోధ చేసినా క్షేత్ర స్థాయిలో ఫలితం లేకుండా పోతోందంటున్నారు. మొత్తానికి చంద్రబాబు ఏదో చేయాలనుకుంటే మరేదో జరిగిందనేది అర్థమవుతోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్