https://oktelugu.com/

ఉక్కు ఉద్యమానికి టీడీపీ దూరం.. సడెన్ గా ఏమైంది..?

ఏపీలో వైఎస్సార్ సీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షంలో కొనసాగుతున్న టీడీపీ చిన్న విషయంలోనూ రాద్దాంతం చేస్తూ.. వచ్చింది. ఏ చిన్న సమస్య వచ్చిన్నట్లు కనిపించినా.. ఉద్యమం అంటూ.. ముందుకొచ్చేది. మూడు రాజధానులు అనగానే అమరావతి ఉద్యమం అంటూ ప్రారంభించింది. ఇదే కాదు.. చాలా చిన్నచిన్న విషయాలను కూడా ఇష్యూ చేస్తూ… వచ్చిన టీడీపీ పార్టీ.. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి దూరంగా ఉంటుందా..? అనే అనుమానం వ్యక్తం అవుతోంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 9, 2021 / 11:22 AM IST
    Follow us on


    ఏపీలో వైఎస్సార్ సీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షంలో కొనసాగుతున్న టీడీపీ చిన్న విషయంలోనూ రాద్దాంతం చేస్తూ.. వచ్చింది. ఏ చిన్న సమస్య వచ్చిన్నట్లు కనిపించినా.. ఉద్యమం అంటూ.. ముందుకొచ్చేది. మూడు రాజధానులు అనగానే అమరావతి ఉద్యమం అంటూ ప్రారంభించింది. ఇదే కాదు.. చాలా చిన్నచిన్న విషయాలను కూడా ఇష్యూ చేస్తూ… వచ్చిన టీడీపీ పార్టీ.. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి దూరంగా ఉంటుందా..? అనే అనుమానం వ్యక్తం అవుతోంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. అదే నిజం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వైజాగ్ స్టీల్ ను ప్రయివేటు పరం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కేంద్రం నిర్ణయం బయటపడగానే ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికులు రోడ్డెక్కారు. వీళ్లకు మద్దతుగా ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు కూడా ఆందోళనలు మొదలు పెట్టాయి.

    ఈ ఆందోళనలను ఉద్యమంగా మలచాలంటే పార్టీ రహితమైన పోరాటాలు అవసరమని రాజకీయ పార్టీలు నిర్ణయించాయి. ఇందులో భాగంగానే ఆదివారం రాత్రి వైజాగ్ లోని సర్క్యూట్ హౌస్ లో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశం మంత్రి అవంతి శ్రీనివాసరావు, వైజాగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి వైసీపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీల నేతలు హాజరు అయ్యారు.

    కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ప్రయివేటీకరణ నిర్ణయం తీసుకుంది మోదీనే కాబట్టి సహజంగానే బీజేపీ నేతలు ఎవరూ హాజరు కాలేదు. మరి తెలుగుదేశం నాయకులకు ఏమైంది..? టీడీపీ నుంచి ఒక్కనేత కూడా సమావేశానికి హాజరు కాలేదు. చివరికి ఆందోళనలకు కూడా మద్దతు తెలపలేదు. ఉక్కు పరిశ్రమకోసం రాజీనామా చేశానని చెప్పుకుంటున్న గంటా శ్రీనివాసరావు కూడా అడ్రస్ ఆ సమావేశంలో కనిపించలేదు.

    ఒక వైపేమో ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం జరగాలని చంద్రబాబు నాయుడు ట్విట్టర్లో కూతపెట్టాడు. ఇంకోవైపేమో.. పార్టీ రహితంగా ఆందోళనలు చేయడానికి కార్యాచరణ కోసమని ఏర్పాటు చేసిన సమావేశానికి టీడీపీ డుమ్మా కొట్టింది. అంటే అందరూ ఉక్కు పరిశ్రమకోసం చేసే ఆందోళనలో పాల్గొనవద్దని మూకుమ్మడిగా తమ్ముళ్లు డిసైడ్ అయ్యారా…? లేకపోతే.. వైసీపీ ఆధ్వర్యంలో జరిగే సమావేశాలకు, ఆందోళనలకు దూరంగా ఉండాలని అనుకున్నారా..? అన్నది తెలియడం లేదు. ఏదేమైనా.. అఖిలపక్షం సమావేశానికి టీడీపీ గైర్హాజరు అవ్వడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.