విభిన్నమైన పాత్రలో అక్కినేని హీరో !

అక్కినేని హీరో సుమంత్ పుట్టిన రోజు నేడు. సుమంత్ మొదటి సినిమా నుండి రెగ్యులర్ సినిమాల జోలికి పోలేదు. వైవిధ్యమైన చిత్రాలతో కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు కోసమే సుమంత్ తపన పడ్డాడు. ఈ క్రమంలో సుమంత్ నటిస్తున్న మరో విభిన్నమైన చిత్రం ‘అనగనగా ఒక రౌడీ’. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా పుట్టినరోజును పురస్కరించుకుని ఇప్పుడు మరో పోస్టర్‌ను ప్రేక్షకుల ముందుకు […]

Written By: admin, Updated On : February 9, 2021 11:29 am
Follow us on


అక్కినేని హీరో సుమంత్ పుట్టిన రోజు నేడు. సుమంత్ మొదటి సినిమా నుండి రెగ్యులర్ సినిమాల జోలికి పోలేదు. వైవిధ్యమైన చిత్రాలతో కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు కోసమే సుమంత్ తపన పడ్డాడు. ఈ క్రమంలో సుమంత్ నటిస్తున్న మరో విభిన్నమైన చిత్రం ‘అనగనగా ఒక రౌడీ’. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా పుట్టినరోజును పురస్కరించుకుని ఇప్పుడు మరో పోస్టర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ‘అనగనగా ఒక రౌడీ’ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ లుక్ లో సుమంత్ కొత్తగా కనిపిస్తున్నాడు.

Also Read: ‘ఉప్పెన’ విరుచుకుపడుతుందా?

మను యజ్ఞ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. సుమంత్ కెరీర్ ‌లోనే ఇదొక వైవిధ్యమైన చిత్రం అట. సుమంత్ పాత్ర రొటీన్‌కు భిన్నంగా వుంటుందని, కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఆయన పాత్ర తప్పకుండా నచ్చుతుందని, వాల్తేరు శ్రీనుగా, విశాఖపట్నం రౌడీగా అందర్ని అలరించే విధంగా ఈ సినిమా వుంటుందని తెలుస్తోంది. ఐమా నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మధునందన్, ధన్‌రాజ్, కళ్యాణ్ చక్రవర్తి తదితరులు నటిస్తున్నారు.

Also Read: ఉప్పెన క్లైమాక్స్ లీక్.. ఇదేనట?

కాగా సెకండ్ ఇన్నింగ్స్‌లో సుమంత్ నుండి మంచి సినిమాలు వస్తున్నాయి. ఇప్పటికే వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. సుమంత్ హీరోగా నటించిన ‘కపటధారి’ సినిమా ఫిబ్రవరి 19న విడుదలవుతోంది. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో సుమంత్ ట్రాఫిక్ పోలీస్ ఎస్‌ఐగా కనిపించనున్నారు. అలాగే శ్రీ నారాయణ అనే మరో కొత్త దర్శకుడితో మరో సినిమా చేయడానికి సుమంత్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్