TDP Dhulipalla Narendra: నెల్లూరు కోర్టులో చోరీ కేసు ఓ కల్పిత కథ.. బాంబు పేల్చిన ధూళిపాళ్ల నరేంద్ర

TDP Dhulipalla Narendra’s criticism of Kakani Govardhan Reddy : నెల్లూరు కోర్టులో దొంగలు పడి తాజా కేబినెట్ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి చెందిన ఓ ఫోర్జరీ ఫైల్స్ మాయం కావడం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో సంచలనమైంది. ప్రతిపక్ష టీడీపీ దీన్ని అస్త్రంగా చేసుకొని ఇప్పుడు తీవ్ర విమర్శలు చేస్తోంది. మంత్రి కాకాణిని టార్గెట్ చేస్తోంది. తాజాగా టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు కోర్టులో […]

Written By: NARESH, Updated On : April 18, 2022 5:40 pm
Follow us on

TDP Dhulipalla Narendra’s criticism of Kakani Govardhan Reddy : నెల్లూరు కోర్టులో దొంగలు పడి తాజా కేబినెట్ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి చెందిన ఓ ఫోర్జరీ ఫైల్స్ మాయం కావడం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో సంచలనమైంది. ప్రతిపక్ష టీడీపీ దీన్ని అస్త్రంగా చేసుకొని ఇప్పుడు తీవ్ర విమర్శలు చేస్తోంది. మంత్రి కాకాణిని టార్గెట్ చేస్తోంది. తాజాగా టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.

నెల్లూరు కోర్టులో దొంగతనం కేసులో ఆ జిల్లా ఎస్పీ కల్పిత కథ బాగా అల్లారని ధూళిపాళ్ల విమర్శలు గుప్పించారు. 14 కేసుల్లోని నిందితులు కుక్కలు మొరిగితే భయపడుతారా? అని ప్రశ్నించారు. కోర్టులో వేల కేసులు ఉంటే కాకాణి కేసు ఆధారాలే ఎందుకు కనిపించాయని అని నిలదీశారు. శిక్ష నుంచి తప్పించుకునేందుకే ఉద్దేశపూర్వకంగా చోరీ చేశారని ధూళిపాళ్ల ఆరోపించారు.

Also Read: Janasena: మత్స్యకారులకు ఆశాదీపంగా పవన్ కళ్యాణ్.. జనసేన వైపు గంగపుత్రుల చూపు

ఈ నెల్లూరు కోర్టు చోరీలో పోలీసులు, కోర్టు ఉద్యోగుల ప్రమేయం ఉందా? ప్రభుత్వ పెద్ద సహకారం లేనిదే చోరీ జరిగిందా? అని ధూళిపాళ్ల ప్రశ్నించారు. కాకాణి మంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే అరాచకమా?అని ప్రశ్నించారు.

మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏడు కేసుల్లో ముద్దాయి అని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించాడు. మాజీ మంత్రి సోమిరెడ్డి ప్రతిష్ట దిగజార్చాలని కాకాణి ఆరోపణలు చేశారన్నారు. అక్రమ ఆధారాలపై సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. కల్పిత ఆధారాలు సృష్టించిన కేసులో ఆధారాలన్నీ కోర్టులో ఉన్నాయన్నారు. కాకాణిపై కేసులు విత్ డ్రా చేసుకుంటున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేసిందని ధూళిపాళ్ల పేర్కొన్నారు.ప్రభుత్వ జీవోను కోర్టు నిరాకరించిందన్నారు. ఈ నేపథ్యంలోనే నెల్లూరు కోర్టులో చోరీ జరిగిందని తెలిపారు.

కోర్టులో చోరీపై అనేక అనుమానాలున్నాయని ధూళిపాళ్ల అన్నారు. అన్ని ఫైల్స్ లో కాకాణి ఫైల్ మాత్రమే ఎలా పోయిందని ఆయన ప్రశ్నించారు. నెల్లూరు కోర్టులో కాకాణి కేసు పత్రాలను ఇప్పుడు టీడీపీ లక్ష్యంగా చేసుకొని విమర్శలు కురిపిస్తోంది. తాజాగా కాకాణి విమర్శలతో మరోసారి అధికార పార్టీ, కాకాణి ఇరుకుపడ్డారు.

ఇక కాకాణి కేసు గురించి చూస్తే.. మాజీ మంత్రి సోమిరెడ్డికి విదేశాల్లో రూ.వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి 2017 డిసెంబరులో ఆరోపించారు. ఆ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లని కొన్ని పత్రాలను మీడియాకు విడుదల చేశారు. అయితే కాకాణి నకిలీ పత్రాలు సృష్టించి తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెల్లూరు రూరల్‌ స్టేషన్ లో సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. కాకాణిపై పరువునష్టం దావా దాఖలు చేశారు. కాకాణి విడుదల చేసినవి నకిలీ పత్రాలుగా ధ్రువీకరించిన పోలీసులు చార్జిషీటు దాఖలుచేశారు. ఆయన్ను ఏ–1 నిందితుడిగా పేర్కొన్నారు. ఈ కేసులో విచారణ చివరికి రావడం.. పక్కాగా కాకాణికి శిక్ష పడుతుందన్న తరుణంలో ఆయన కేసు పత్రాలు కోర్టులో చోరీ కావడం చర్చనీయాంశమైంది.

Also Read: Sarkaru Vaari Paata: మహేష్ – కీర్తి సురేష్ రొమాన్సే చివరి ఘట్టం !