https://oktelugu.com/

RRR OTT Release Date: RRR మూవీ OTT రిలీజ్ డేట్ వచ్చేసింది

RRR OTT Release Date: బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన #RRR చిత్రం గురించి అభిమానులకు ఇప్పుడు ఒక్క లేటెస్ట్ వార్త ఆనందానికి గురి అయ్యేలా చేస్తోంది..ఇంతకాలం థియేటర్స్ లో అలరించిన ఈ సినిమా అతి త్వరలోనే డిజిటల్ ప్లాట్ ఫోరమ్ లో అడుగుపెట్టబోతుంది..ఈ సినిమా మే 25 వ తారీకు నుండి జీ 5 యాప్ లో అందుబాటులోకి రాబోతుంది అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 18, 2022 / 03:02 PM IST
    Follow us on

    RRR OTT Release Date: బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన #RRR చిత్రం గురించి అభిమానులకు ఇప్పుడు ఒక్క లేటెస్ట్ వార్త ఆనందానికి గురి అయ్యేలా చేస్తోంది..ఇంతకాలం థియేటర్స్ లో అలరించిన ఈ సినిమా అతి త్వరలోనే డిజిటల్ ప్లాట్ ఫోరమ్ లో అడుగుపెట్టబోతుంది..ఈ సినిమా మే 25 వ తారీకు నుండి జీ 5 యాప్ లో అందుబాటులోకి రాబోతుంది అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అయ్యింది..మే 25 వ తారీకు నాటికి ఈ సినిమా వచ్చి 50 రోజులు పూర్తి అవ్వబోతుండడం తో మేకర్స్ ఆ తేదీన OTT లో విడుదల చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు..ఈ సినిమా డిజిటల్ మరియు సాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు సంస్థ వారు అక్షరాలా 325 కోట్ల రూపాయలకు కొన్నారు..ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఇది ఒక్క ఆల్ టైం రికార్డు అని చెప్పొచ్చు..ఇప్పటి వరుకు మన స్టార్ హీరోల డిజిటల్ మరియు సాటిలైట్ రైట్స్ రెండు కలిపి కనీసం 100 కోట్ల రూపాయిల బిజినెస్ కూడా జరగలేదు..అలాంటిది #RRR మూవీ ఏకంగా 325 కోట్ల రూపాయిల బిజినెస్ చేసింది అంటే ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

    RRR OTT Release Date

    జీ తెలుగు లో ఇటీవల కాలం లో ఇప్పటి వరుకు ప్రసారం అయినా సినిమాలలో కేవలం వకీల్ సాబ్ మరియు రంగడే సినిమాలు మాత్రమే హైయెస్ట్ TRP రేటింగ్స్ ని దక్కించుకొని సూపర్ హిట్స్ గా నిలిచాయి..ఇప్పుడు ఆ ఛానల్ టర్నోవర్ #RRR సినిమాతో పదింతలు పెంచుకోవాలనే టార్గెట్ తో ఉంది జీ తెలుగు ఛానల్..ఫామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవ్వడం తో ఎన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు పోటీకి ఎదురుగా వచ్చినా #RRR బాక్స్ ఆఫీస్ రన్ ఇప్పటికి కూడా ఎంతో డీసెంట్ గా కొనసాగుతుంది..ఫామిలీ ఆడియన్స్ ఈ స్థాయిలో కనెక్ట్ అయ్యారు కాబట్టి ఈ సినిమా OTT మరియు టీవీ ఛానల్ టెలికాస్ట్ లో కూడా అద్భుతమైన వ్యూయర్ షిప్ ని సొంతం చేసుకుంటుంది అని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు..మరి బాక్స్ ఆఫీస్ వద్ద లెక్కలేనన్ని రికార్డ్స్ ని సృష్టించిన ఈ చిత్రం OTT మరియు డిజిటల్ లో కూడా అదే స్థాయి రికార్డ్స్ సృష్టిస్తుంది అని జీ తెలుగు టీం వారు బలమైన కాన్ఫిడెంట్ తో ఉన్నారు..చూడాలి మరి OTT లో కూడా ఈ సినిమా అదే స్థాయిలో పేక్షకులను అలరిస్తుందో లేదో అనేది.

    Also Read: RRR 23 Days : ఇంకా అదే ఊపు.. కారణం అదే ?

    ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇటీవలే 1200 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..1200 కోట్ల రూపాయిల గ్రాస్ కి గాను ఈ సినిమా 620 కోట్ల రూపాయిల షేర్ ని ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి వసూలు చేసింది అని తెలుస్తుంది..తెలుగు రాష్ట్రాల్లో 270 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి బాహుబలి 2 రికార్డ్స్ ని కొల్లగొట్టి అల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ చిత్రం , బాలీవుడ్ లో కూడా ప్రతిష్టాత్మక 250 కోట్ల రూపాయిల నెట్ క్లబ్ లోకి చేరిపోయింది..ఇప్పటికి డీసెంట్ రన్ వచ్చే అవకాశం ఉండడం తో ఫుల్ రన్ లో ఈ సినిమా మరో 20 కోట్ల రూపాయిల నెట్ కేవలం హిందీ నుండి వసూలు చేసే అవకాశం ఉంది ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త ..చూడాలి మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ఎక్కడ వరుకు ఆగుతుంది అనేది.

    Also Read: RRR Movie Box Office Collection: ఇంకా త‌గ్గ‌ని ఆర్ఆర్ఆర్ క్రేజ్‌.. 23వ రోజు రికార్డు క‌లెక్ష‌న్లు.. మొత్తంగా ఎంత లాభ‌మంటే..?

    Recommended Videos:

    Tags