https://oktelugu.com/

తిరుపతి ఉప ఎన్నిక కోసం టీడీపీ చీకటి ఒప్పందం

అవకాశవాద రాజకీయాలకు కేరాఫ్‌ చంద్రబాబు నాయుడు అని చెప్పకనే చెబుతారు అందరు. రాజకీయంగా ఆయన సేఫ్‌ సైడ్‌ ఉండేందుకు ఎలాంటి రాజకీయానికైనా దిగుతాడు. ఒకప్పుడు బద్ధ శత్రువైన పార్టీతోనూ మిత్రుత్వం పెంచుకునేందుకు కూడా వెనుకాడరు. ఎప్పుడు ఏ పార్టీని విమర్శిస్తాడో.. ఎప్పుడు ఏ పార్టీని దగ్గరికి తీస్తాడో తెలియదు. మొత్తానికి ప్రత్యర్థిని దెబ్బతీయడానికి కుటిల రాజకీయాలను మాత్రం వీడరు. Also Read: కాంగ్రెస్ విలాపం: రాష్ట్రాల్లో సీట్లు ఇచ్చేవారే లేరా? సొంత పార్టీని దెబ్బతీసి అయినా ప్రధాన […]

Written By:
  • NARESH
  • , Updated On : November 21, 2020 3:53 pm
    Follow us on

    TDP

    అవకాశవాద రాజకీయాలకు కేరాఫ్‌ చంద్రబాబు నాయుడు అని చెప్పకనే చెబుతారు అందరు. రాజకీయంగా ఆయన సేఫ్‌ సైడ్‌ ఉండేందుకు ఎలాంటి రాజకీయానికైనా దిగుతాడు. ఒకప్పుడు బద్ధ శత్రువైన పార్టీతోనూ మిత్రుత్వం పెంచుకునేందుకు కూడా వెనుకాడరు. ఎప్పుడు ఏ పార్టీని విమర్శిస్తాడో.. ఎప్పుడు ఏ పార్టీని దగ్గరికి తీస్తాడో తెలియదు. మొత్తానికి ప్రత్యర్థిని దెబ్బతీయడానికి కుటిల రాజకీయాలను మాత్రం వీడరు.

    Also Read: కాంగ్రెస్ విలాపం: రాష్ట్రాల్లో సీట్లు ఇచ్చేవారే లేరా?

    సొంత పార్టీని దెబ్బతీసి అయినా ప్రధాన ప్రత్యర్థిని దెబ్బతీయాలని చూస్తుంటాడు. గ‌త ప‌దేళ్ల చ‌రిత్రను ప‌రిశీలించినా.. కొన్నిసార్లు సొంతానికి దెబ్బ వేసుకుని కూడా ప్రత్యర్థిని దెబ్బతీసే ప్రయ‌త్నాలు కొన్ని క‌నిపిస్తాయి. వైఎస్ జ‌గ‌న్ కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత జ‌రిగిన క‌డ‌ప ఎంపీ సీటు ఉప ఎన్నిక‌, పులివెందుల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక ద‌గ్గర నుంచి టీడీపీ ఉప ఎన్నిక‌ల విష‌యంలో త‌ను గెల‌వ‌డం క‌న్నా జ‌గ‌న్‌ను దెబ్బతీయ‌డ‌మే ప‌నిగా వ్యూహాల‌ను అవ‌లంబించింది. ఇక జ‌గ‌న్ వెంట నిలిచిన ఎమ్మెల్యేల రాజీనామాల‌తో అప్పట్లో వ‌చ్చిన బై పోల్స్ లో ఏం జ‌రిగిందో కూడా వేరే చెప్పనక్కర్లేదు. అప్పట్లో జ‌గ‌న్ త‌ర‌ఫున నిలిచిన ఎమ్మెల్యేల‌ను ఓడించ‌డ‌మే ప‌నిగా పెట్టుకుని కాంగ్రెస్ అభ్యర్థుల‌కు లోలోప‌లి మ‌ద్దతు ఇచ్చిన ఘ‌న‌త కూడా తెలుగుదేశం పార్టీదే.

    చాలాకాలం పాటు టీడీపీకి కాంగ్రెస్‌ ప్రత్యర్థి. కానీ.. ఇప్పుడు ఆయన ప్రత్యర్థి వైఎస్‌ జగన్‌ మాత్రమే. అందుకే వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల‌ను పెట్టిన‌ట్టే పెట్టి లోలోప‌ల మాత్రం కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవ‌హ‌రించింది టీడీపీ.కానీ.. మంచి ఊపు మీద ఉన్న జగన్‌ను దెబ్బతీయడం అంత తేలిక కాదనేది టీడీపీకి తెలుసు. కాంగ్రెస్‌ కూడా పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయిన పార్టీ. అయితే అప్పట్లో బ‌లంగా వీచిన జ‌గ‌న్ గాలిలో చంద్రబాబు నాయుడి వ్యూహం పార‌లేదు!

    Also Read: లోకేష్‌ ఎక్కడా!.. ఇప్పుడిదే హాట్ టాపిక్?

    ఫలితంగా కాంగ్రెస్‌ చిత్తయ్యింది. టీడీపీ డిపాజిట్లు కూడా కోల్పోయింది. జ‌గ‌న్ పార్టీ త‌ర‌ఫున ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి వెళ్లారు. నాటి ఉప ఎన్నిక‌ల్లో క‌నీసం డిపాజిట్ కూడా సంపాదించుకోలేనంత ఓట‌మిని టీడీపీ ఎదుర్కొందంటే దానికి కార‌ణం లోలోప‌ల కాంగ్రెస్ కు స‌పోర్ట్ చేయ‌డ‌మే అని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ గెలుపు కోసం చంద్రబాబు నాయుడు సొంత పార్టీ అభ్యర్థికి ఝ‌ల‌క్ ఇచ్చారు. అయితే చంద్రబాబుకు ఇప్పుడు ఛాయిస్ లేదు. త‌న మార్కు వ్యూహాల‌నే ఆయ‌న ఫాలో అవుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగా.. తిరుప‌తిలో కూడా అదే జ‌ర‌గ‌బోతోంద‌ని అప్పుడే టాక్ మొద‌లైంది. ఇప్పటికే తిరుప‌తి బై పోల్ కోసం అభ్యర్థిని ప్రక‌టించారు చంద్రబాబు నాయుడు. అయితే ఎలాగూ ఇది గెలిచే బేరం కాదు. అయితే చంద్రబాబు నీడ అధికారికంగా ప‌డ‌టం బీజేపీకి ఇష్టం లేన‌ట్టుంది. అందుకే ఆయ‌న మ‌ద్దతును ఆ పార్టీ వ‌ద్దని చెప్పింది. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి రాజకీయానికి తెరతీయబోతున్నాడో చూడాలి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్