https://oktelugu.com/

కుప్పంలో టీడీపీ పుట్టి ముంచిన తమ్ముళ్లు

సొంత ఇలాఖాలోనే చంద్రబాబును పుట్టిముంచారు ఆ పార్టీ కార్యకర్తలు. చంద్రబాబు నమ్మకం పెట్టుకున్న నేతలందరూ నట్టేట ముంచడంతో కుప్పంలో టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా బరస్టయ్యారు. మూడు రోజులపాటు కుప్పంలో పర్యటించాలని ఇక అధినేత నిర్ణయానికి వచ్చారు. 25 నుంచి 27వ తేదీ వరకూ చంద్రబాబు పర్యటన సాగనుంది. ఈ పర్యటన అంశంపై చర్చించేందుకు పార్టీ నేతలు , కార్యకర్తలు కుప్పంలోని కార్యాలయంలో సమావేశమయ్యారు. Also Read: టీఆర్‌‌ఎస్‌పై బీజేపీ సీబీఐ అస్త్రం అయితే.. ఈ సమావేశంలో కార్యకర్తలు […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 24, 2021 2:27 pm
    Follow us on

    TDP damaged in Kuppam
    సొంత ఇలాఖాలోనే చంద్రబాబును పుట్టిముంచారు ఆ పార్టీ కార్యకర్తలు. చంద్రబాబు నమ్మకం పెట్టుకున్న నేతలందరూ నట్టేట ముంచడంతో కుప్పంలో టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా బరస్టయ్యారు. మూడు రోజులపాటు కుప్పంలో పర్యటించాలని ఇక అధినేత నిర్ణయానికి వచ్చారు. 25 నుంచి 27వ తేదీ వరకూ చంద్రబాబు పర్యటన సాగనుంది. ఈ పర్యటన అంశంపై చర్చించేందుకు పార్టీ నేతలు , కార్యకర్తలు కుప్పంలోని కార్యాలయంలో సమావేశమయ్యారు.

    Also Read: టీఆర్‌‌ఎస్‌పై బీజేపీ సీబీఐ అస్త్రం

    అయితే.. ఈ సమావేశంలో కార్యకర్తలు పార్టీ నేతల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు గ్రామాల్లో ఎలా వ్యవహరిస్తున్నారో తెలిసి కూడా పట్టించుకోలేదని.. అందుకే ఓటమి పాలయ్యామని మండిపడ్డారు. కార్యకర్తల ఆగ్రహంతో చంద్రబాబు పీఏ మనోహర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. మనోహర్ 30 ఏళ్లుగా చంద్రబాబు పీఏగా ఉంటూ కుప్పం బాధ్యతలు చూస్తున్నారు.

    సీఎంగానో ప్రతిపక్ష నేతగానో తీరిక లేకుండా ఉండే చంద్రబాబు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు మనోహర్‌‌ను పీఏగా పెట్టుకున్నారు. ఆయన ద్వారానే పనులు చక్కబెడుతున్నారు. మనోహర్‌తోపాటు ఎమ్మెల్సీ గౌనిగారి శ్రీనివాసులు స్వగ్రామం కూడా కుప్పం పరిధిలోనే ఉంటుంది. అయినప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో దారుణ పరాజయాలు తప్పలేదు.

    Also Read: ఉన్నట్టుండి జగన్‌కు అమరావతిపై ప్రేమెందుకు పుట్టుకొచ్చినట్లు..?

    దీంతో కార్యకర్తలు తప్పుపట్టడంతో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మునిరత్నం కూడా తన పదవికి రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారు. ఎమ్మెల్సీ గౌనిగారి శ్రీనివాసులు కార్యకర్తల మధ్యనే కూర్చున్నారు. సొంత గ్రామంలో కూడా టీడీపీ మద్దతుదారు అభ్యర్థిని గెలిపించుకోలేకపోయానని ఆయన అలా చేశారు. కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతల ఆగ్రహంతో కుప్పంకు చెందిన పలువురు టీడీపీ నేతలు సమావేశం మధ్యలో నుంచే వెళ్లిపోయారు. అందరూ అధినేత మెప్పు కోసం చూశారు తప్ప కింది స్థాయి కార్యకర్తలను ఎవరూ పట్టించుకోలేదు. అందుకే ఈ ఫెయిల్యూర్స్‌ ఎదురైనట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్