ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై చాలా మందికి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన మాకంటే జూనియర్ అని ఏమీ తెలియదని భావిస్తున్నారు. కానీ ఆయన ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగిపోయారని తెలుస్తోంది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ పరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. మంచి విధానాలు అవలంభిస్తూ ప్రజల్లో గుర్తింపు తెచ్చకుంటున్నారు. దీంతో ప్రతిపక్షాలు సైతం ఢీకొనలేకపోతున్నాయి. సంక్షేమ పథకాలే పెట్టుబడిగా దూసుకుపోతున్నారు. జనం మెచ్చే నాయకుడిగా ఎధుగుతున్నారు. వాస్తవ దృష్టితో ఆలోచిస్తూ నింతరం తనలో మార్పులు తెచ్చుకుంటున్నారు.
జగన్ విషయంలో ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. అయినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే ఆయన అన్ని అనుభవాలు చూశారు. జైలుకు సైతం వెళ్లి వచ్చారు. దీంతో ప్రతిపక్షాల బెదిరింపులకు ఏనాడు భయపడడం లేదు. రాజకీయ కుట్రలో భాగంగా ఒకవేళ జైలుకు వెళ్లితే మిగతా పార్టీలకు భవితవ్యం ఉంటుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి ఎన్నో అడ్డంకులు దాటి ఈ స్థాయికి వచ్చిన ఆయన దేనికి కూడా భయపడడం లేదు.
ముఖ్యమంత్రి జగన్ మీద ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయి. ఆయన చేసే పనులు బాగా ఉండడంతో తన ప్రభుత్వానికి ఏ ఢోకా లేదనే ధీమాగా ఉన్నారు. జగన్ ఇమేజ్ రోజురోజుకు పెరిగిపోవడంతో ఆయనను పదవి నుంచి దించడం ఆషామాషీ కాదనే విసయం అందరికి అర్థమైపోయింది. దీంతో వారు ఇతర దారులు వెతుకుతున్నారు. జగన్ తప్పుకున్నా అంతటి స్థాయిలో పరిపాలన చేయగల నాయకుడి లేదనే చెప్పుకునేలా ఆయన తనదైన మార్కు వేస్తున్నారు. దీంతో ప్రతిపక్షాలు సైతం ఏమీ చేయలేకపోతున్నాయని తెలుస్తోంది.
జగన్ పాలనకు గీటురాయి ఆయన పరిపాలనే అని చెప్పుకోవాలి. ఎన్ని విమర్శలు వచ్చిన జంకకుండా తాను అనుకున్నది చేసే క్రమంలో ముందుకు వెళుతున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలు పట్టించుకోవడం లేదు. ఫలితంగా పథకాల్లో ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తున్నారు. జగన్ అన్ని స్థాయిలు దాటుకుని మంచి నాయకుడిగా గుర్తిం పు తెచ్చుకునేందుకు పాట్లు పడుతున్నారు. ప్రజల ఆమోదమే లక్ష్యంగా పరిపాలన చేస్తూ తనసత్తా నిరూపించుకుంటున్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాలకు ఏమి పాలుపోవడం లేదు. జగన్ ను ఢీకొనడం ఎలాగని తలలు పట్టుకుంటున్నారు. ఆయన ఇమేజ్ చూస్తేనే డ్యామేజీ అయిపోతున్నారు. పరిపాలనలో ఏమరుపాటు లేకుండా చూసుకుంటున్నారు.అవినీతి, పక్షపాతానికి తావులేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అధికారులను సైతం సరైన దారిలో పెడుతూ పరిపాలనను పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో ఏపీలో8 మెరుగైన నాయకుడిగా ఎదుగుతూ సాగిపోతున్నారు.