Tammareddy Bharadwaja: నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం లో దిట్ట. అసలు మొహమాటం అనేది లేకుండా చాలా డైరెక్ట్ గా ఆయన చెప్పాల్సింది చెబుతూ పోతారు. తాజాగా సినీ పరిశ్రమపై ఏపీ నేతలు చేసిన వ్యాఖ్యల పై తమ్మారెడ్డి ఘాటుగా స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘సినీ పరిశ్రమను నిందిస్తున్న నాయకులు తలదించుకోవాలి. కుల ప్రస్తావన లేకుండా ఉపాధి కల్పించేది సినీ పరిశ్రమ మాత్రమే. సామాజిక వర్గాల పేరుతో రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు ?
మీ ఎమ్మెల్యేలు ఎంత తింటున్నారో బహిరంగ చర్చకు సిద్ధమా ? అంటూ నిలదీశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. ‘పుష్ప’ తీసిన నిర్మాతలు ఒక కులానికి చెందినవారు కావటం వల్లే మరో కులానికి చెందిన వారిని సినిమాలో తిట్టారని పలువురు ఆరోపిస్తూ ఏవేవో మాట్లాడుతున్నారు. అసలు సినిమా విషయంలో కులాలు, మతాలు ఎందుకు ? గతంలో కొందరు నాయకులు రెచ్చిపోయి మాట్లాడారు. వాళ్లు గడ్డి తిన్నారని ఇప్పుడు మీరూ గడ్డి తింటున్నారా ?
Also Read: టాలీవుడ్ పై వైసీపీ ఎమ్మెల్యే దారుణ వ్యాఖ్యలు
మీకు ఒక సామాజిక వర్గం ఓట్లు వస్తే గెలవలేదు. అందరూ ఓట్లు వేశారు. సినిమా వాళ్లు చీప్‌గా దొరికారని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? సామాజిక వర్గాల పేరుతో రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు ? ఎమ్మెల్యేలు మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీ ఆస్తులెంత? ఇప్పుడెంత? అంటూ ఫైర్ అయ్యారు .
మీకు తెలియదు. ఒక సినిమా కోసం వందల మంది కష్టపడతారు. కష్టపడితే వచ్చే ప్రాజెష్ట అది. కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత పైసా పైసా ఏరుకుంటున్నాం. మీలాగా రూపాయి పెట్టి కోట్లు దోచుకోవడం లేదు. సినిమా వాళ్ళను అనే ముందు మీ సంగతి మీరు చూసుకోండి. రాజకీయ నేతలు ఇంకెప్పుడూ బెదిరింపులకు పాల్పడవద్దు.