https://oktelugu.com/

Devara OTT: మరో నాలుగు రోజుల్లో ఓటీటీలోకి రానున్న ‘దేవర’..అదనపు సన్నివేశాలు కూడా ఉంటాయా..ఎందులో చూడాలంటే?

ఎన్టీఆర్ గత చిత్రం '#RRR' కి నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సుమారుగా ఏడాది పాటు ఈ చిత్రం టాప్ 10 లో ట్రెండ్ అయ్యింది. కేవలం ఇండియన్ ఆడియన్స్ మాత్రమే కాకుండా వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు కూడా ఈ చిత్రాన్ని ఎగబడి చూసారు. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కెమరూన్ వంటి వారు కూడా ఈ చిత్రాన్ని ప్రశసించారంటే ఏ రేంజ్ రీచ్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఆస్కార్ అవార్డు ని కూడా దక్కించుకుంది.

Written By:
  • Vicky
  • , Updated On : November 4, 2024 / 03:25 PM IST

    Devara OTT

    Follow us on

    Devara OTT: యావరేజ్ టాక్ తో మొదలైన ‘దేవర’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన వసూళ్ల సునామీ ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. విడుదలకు ముందు భారీ అంచనాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల, ఫ్యాన్స్ షోస్ నుండి సెకండ్ హాఫ్ పై నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది కానీ, ఫ్యామిలీ, మాస్ ఆడియన్స్ కి సెకండ్ హాఫ్ కూడా బాగా నచ్చడంతో నెల రోజుల పాటు నాన్ స్టాప్ గా మంచి థియేట్రికల్ రన్ ఈ సినిమాకి వచ్చింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషలకు కలిపి ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, నిన్నటితో థియేట్రికల్ రన్ ని ముగించుకుంది. దీంతో నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం నవంబర్ 8 వ తేదీన ఈ చిత్రం ఓటీటీ ఆడియన్స్ కి అందుబాటులోకి రానుంది. నెట్ ఫ్లిక్స్ లో అన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి రానున్న ఈ సినిమాకి ఓటీటీ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

    ఎన్టీఆర్ గత చిత్రం ‘#RRR’ కి నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సుమారుగా ఏడాది పాటు ఈ చిత్రం టాప్ 10 లో ట్రెండ్ అయ్యింది. కేవలం ఇండియన్ ఆడియన్స్ మాత్రమే కాకుండా వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు కూడా ఈ చిత్రాన్ని ఎగబడి చూసారు. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కెమరూన్ వంటి వారు కూడా ఈ చిత్రాన్ని ప్రశసించారంటే ఏ రేంజ్ రీచ్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఆస్కార్ అవార్డు ని కూడా దక్కించుకుంది. అలాంటి రీచ్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ నుండి విడుదల అవుతున్న సినిమా కావడంతో ‘దేవర’ కి కూడా నెట్ ఫ్లిక్స్ లో అలాంటి రెస్పాన్స్ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇటీవల కాలం లో విజయ్ సేతుపతి ‘మహారాజ’ చిత్రానికి నెట్ ఫ్లిక్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సుమారుగా ఆరు నెలలు ఈ చిత్రం టాప్ 10 లో ట్రెండ్ అయ్యింది. ‘దేవర’ ఆ రికార్డుని బద్దలు కొడుతుందో లేదో చూడాలి.

    ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ లో అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ‘వార్ 2 ‘ మూవీ షూటింగ్ లో నటిస్తున్నాడు. హ్రితిక్ రోషన్ హీరో గా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఆయన ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోయే సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ‘వార్ 2 ‘ చిత్రం వచ్చే ఏడాది ఆగష్టు 14వ తేదీన విడుదల కాబోతుండగా, ప్రశాంత్ నీల్ తో చేయబోయే చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ రెండు సినిమాలతో పాటు బాలీవుడ్ లో మరో చిత్రం, అలాగే అనిల్ రావిపూడితో మరో చిత్రం చేయడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.