Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతున్న తమిళ్ సూపర్ స్టార్…

మరి పవన్ కళ్యాణ్ తన అభిమానుల్లో అంతలా మ్యాజిక్ ని క్రియేట్ చేయడానికి చాలా కష్టపడ్డాడు అనే చెప్పాలి. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు, తనకి డాన్స్ చేయడం రాకపోయిన ఆయన అభిమానుల కోసం అది కూడా నేర్చుకున్నాడు.

Written By: NARESH, Updated On : February 3, 2024 11:21 pm
Follow us on

Pawan Kalyan : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాల వల్ల ఆయనకి వచ్చిన క్రేజ్ అలాంటిది. మరి ముఖ్యంగా 90స్ కిడ్స్ అయితే పవన్ కళ్యాణ్ అంటే పడి చచ్చిపోతారు. మరి పవన్ కళ్యాణ్ తన అభిమానుల్లో అంతలా మ్యాజిక్ ని క్రియేట్ చేయడానికి చాలా కష్టపడ్డాడు అనే చెప్పాలి. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు, తనకి డాన్స్ చేయడం రాకపోయిన ఆయన అభిమానుల కోసం అది కూడా నేర్చుకున్నాడు.

సినిమాల్లో ఆయన క్రేజ్ పీక్స్ లో ఉన్నప్పుడే ‘జనసేన’ అనే రాజకీయ పార్టీ పెట్టీ రాజకీయాల్లోకి వచ్చేసాడు. ప్రస్తుతం పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉన్నాడు. ఇక ఆయన పాలిటిక్స్ లో ఎంత బిజీ గా ఉన్న కూడా అభిమానులను నిరాశపరిచకూడదు అనే ఉద్దేశ్యం తోనే మధ్యలో కొన్ని సినిమాలు చేస్తూ ఇటు సినిమాలు, ఆటు పాలిటిక్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు.

ఇక ఇది ఇలా ఉంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఇళయ దళపతి గా మంచి పేరు సంపాదించుకున్న విజయ్ కూడా ఇప్పుడు ‘తమిళ్ గా వెట్రి కళిగం’ అనే రాజకీయ పార్టీ పెట్టి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. విజయ్ సినిమాల్లో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ను కాపీ చేస్తాడు అంటూ రూమర్లైతే వచ్చేవి, ఇక సినిమాల్లో కాకుండా రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ ని కాపీ చేస్తున్నాడా అంటూ పలువురు సినీ మేధావులు సైతం పలు ఆసక్తికరమైన కామెంట్స్ అయితే చేస్తున్నారు.

అయితే తమిళనాడులో ప్రస్తుతం స్టాలిన్ గవర్నమెంట్ ఉంది. మరి దాన్ని ఎదుర్కొని విజయ్ కొత్తగా గవర్నమెంట్ ఫామ్ చేయగలడా అనే విషయాలు కూడా ఇప్పుడు చర్చనీయాంశం గా మారాయి. ఇక ఇదిలా ఉంటే విజయ్ పవన్ కళ్యాణ్ స్టైల్ ను ఇమిటేట్ చేస్తూ మంచి విజయాలను అందుకున్నాడు. అలాగే ఇప్పుడు పాలిటిక్స్ లో కూడా పవన్ కళ్యాణ్ బాట లోనే నడుస్తుండటం గమనార్హం…చూడాలి మరి విజయ్ పాలిటిక్స్ లో ఎంతవరకు సక్సెస్ అవుతాడు అనేది…ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఆయన కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేసి 2026 లో తమిళనాడు లో జరిగే శాసన సభ ఎలక్షన్స్ కోసం తన పార్టీ ని సిద్దం చేస్తున్నట్టు గా తెలుస్తుంది….