తమిళనాడు డీఎంకేదే.. స్టాలిన్ సీఎం పక్కా!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టే తమిళనాడులో డీఎంకే అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా ఫలితాల సరళి చూస్తే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉంది. అధికార అన్నాడీఎంకే తర్వాతి స్థానంలో కొనసాగుతోంది. ఇక కమల్ హాసన్ పార్టీ ‘మక్కల్ నీది మయ్యం’ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ పార్టీ నుంచి ఒక్క కమల్ మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో […]

Written By: NARESH, Updated On : May 2, 2021 11:13 am
Follow us on

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టే తమిళనాడులో డీఎంకే అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

తాజాగా ఫలితాల సరళి చూస్తే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉంది. అధికార అన్నాడీఎంకే తర్వాతి స్థానంలో కొనసాగుతోంది. ఇక కమల్ హాసన్ పార్టీ ‘మక్కల్ నీది మయ్యం’ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ పార్టీ నుంచి ఒక్క కమల్ మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో మేజిక్ మార్క్ 118 స్థానాలు వస్తే అధికారం ఖాయం. అయితే ఇప్పటికే డీఎంకే కూటమి 115 స్థానాల్లో ముందంజలో ఉంది. అధికార అన్నాడీఎంకే 72 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఏఏఎంకే పార్టీ నేత దినకరణ్ వెనుకబడ్డారు. సీఎం ఫళినస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంలు ముందంజలో కొనసాగుతున్నారు.

డీఎంకే అధినేత స్టాలిన్ లీడ్ లో కొనసాగుతున్నారు. సీఎం అయ్యే అవకాశాలున్న స్టాలిన్ విజయం ఖాయంగా కనిపిస్తోంది.