Homeజాతీయ వార్తలుTamil Nadu CM MK Stalin : సీఎం గారి ఆర్డర్.. నూతన దంపతులు 16...

Tamil Nadu CM MK Stalin : సీఎం గారి ఆర్డర్.. నూతన దంపతులు 16 మంది పిల్లల్ని కనాల్సిందే..

Tamil Nadu CM MK Stalin :  జనాభా విషయంలో మన దేశం చైనా ను దాటింది.. ప్రపంచంలోనే అత్యధికంగా జనాభా ఉన్న దేశంగా అవతరించింది. ఇలా జనాభా పెరుగుకుంటూ పోతే ఆహార సంక్షోభం, వనరుల సంక్షోభం ఎదురవుతుంది కాబట్టి.. జనాభా ను తగ్గించడానికి గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణను అమలు చేస్తున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం ప్రజలు వీలైనంత మందిని కనాలని పిలుపునిస్తున్నారు. ఆ మధ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలు ఇద్దరి కంటే ఎక్కువ పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. జనాభా పెరిగితేనే ఒక రాష్ట్రం, దేశం బాగుంటాయని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఈ జాబితాలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్ కూడా చేరారు. ప్రస్తుతం పరిస్థితులు బాగోలేవని, అందువల్ల 16 రకాల సంపదలకు బదులుగా 16 మంది పిల్లల్ని కావాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తమిళనాడు రాష్ట్రంలో హిందూ మత, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సామూహిక వివాహాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 31 జంటలు వివాహ బంధం ద్వారా ఒకటయ్యాయి. వివాహ క్రతుము పూర్తయిన తర్వాత స్టాలిన్ నూతన వధూవరులను ఉద్దేశించి మాట్లాడారు. కొత్తగా వివాహం చేసుకున్నవారు ఎక్కువమంది పిల్లలకు జన్మని వాళ్ళని పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం 16 మంది పిల్లల్ని కానాల్సిన అవసరం ఉందని వివరించారు. ” పూర్వకాలంలో నూతన వధూవరులను ఆశీర్వదించేటప్పుడు 16 రకాల సంపదలు కలిగి సుభిక్షంగా జీవించాలని పెద్దలు దీవించేవారు. అంటే ఆ 16 మంది పిల్లలు కాదు.. 16 రకాల సంపదలు. వీటిని ప్రశంసలు, పంట, నీరు, వయస్సు, ఆస్తి, బంగారం, వాహనం, జ్ఞానం, ఆవు, ఇల్లు, పిల్లలు, విద్య, జిజ్ఞాస, క్రమశిక్షణ, భూమి, వయస్సు అని ప్రముఖ రచయిత విశ్వనాథన్ తన పుస్తకంలో పేర్కొన్నారని” స్టాలిన్ వెల్లడించారు..” గతంలో నూతన వధూవరులను దీవించేటప్పుడు 16 రకాల సంపదలను పొందాలని పెద్దలు అనేవారు. కానీ ఇప్పుడు 16 రకాల సంపదలను పొందాలని పెద్దలు దీవించడం లేదు. పిల్లల్ని కని.. అన్యోన్యంగా ఉంటే చాలని మాత్రమే దీవిస్తున్నారు. జన బతకడం వల్ల పార్లమెంటరీ నియోజకవర్గం తగ్గించే అవకాశం ఉంది. అందువల్ల 16 మంది పిల్లల్ని మనం కనాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. దీనిని మీరు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దని” స్టాలిన్ వ్యాఖ్యానించారు.

గతంలో చంద్రబాబు కూడా..

గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. జనాభాలో సమతుల్యం లేకపోవడం వల్ల వృద్ధులు పెరిగిపోతున్నారని వ్యాఖ్యానించారు. యువశక్తి తగ్గిపోవడం వల్ల అది అంతిమంగా రాష్ట్ర, దేశ అభివృద్ధిపై ప్రభావం చూపిస్తుందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల కుటుంబాలు ఎక్కువమంది పిల్లల్ని కలిగి ఉండాలని చంద్రబాబు సూచించారు. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్న వ్యక్తులు మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించే విధంగా చట్టాన్ని తీసుకువచ్చేందుకు తమ ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుందని చంద్రబాబు అప్పట్లో వ్యాఖ్యానించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular