
Tamil batch dropped for votes: ఎమ్మెల్సీలను ఎవరు ఎన్నుకుంటారు? గ్రాడ్యుయేట్లు. గ్రాడ్యుయేట్లు అనగా ఎవరు? డిగ్రీ పట్టభద్రులు. ఇలాంటి పట్టభద్రులు ఎమ్మెల్సీలను ఎన్నుకునే క్రమంలో ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాలకు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఓట్లు వేసింది గ్రాడ్యుయేట్లు కాదు. తమిళనాడు కూలీలు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమిళనాడు ఓటర్లకు ఎలా కల్పించారు? వాళ్లు ఓట్లు వేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? అనే కదా మీ అనుమానం? అది ఆంధ్రప్రదేశ్ కాబట్టి అటువంటి అనుమానాలకు తావివ్వకూడదు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసిపి, ప్రతిపక్ష టీడీపీ హోరాహోరీగా ప్రచారం చేశాయి. మేమేం ఏం చేశామనని వైసీపీ చెబితే, వైసిపి ఏం చేయలేదని టిడిపి.. రకరకాలుగా ప్రచారాలు చేశాయి. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలను రాజకీయ పార్టీలు పెద్దగా పట్టించుకునేవి కావు.. ఇప్పుడు పరిస్థితి మారింది.. వచ్చే ఎన్నికలకు రెఫరండంగా వైసీపీ భావిస్తుండగా… ఎలాగైనా గెలిచి చాటాలని టిడిపి భావిస్తోంది. ఈ క్రమంలోనే విజయం కోసం టిడిపి అడ్డదారులు తొక్కడం ప్రారంభించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను భారీగా నమోదు చేయించింది. కాకపోతే తప్పుడు డిగ్రీ ధ్రువీకరణ పత్రాలను సమర్పించింది. మరి ఎన్నికల అధికారులకు ఏమైందో తెలియదు కానీ.. ఆ తప్పుడు దృవీకరణ పత్రాలను సరిగా పరిశీలించకుండానే ఓటు హక్కు కల్పించారు.

ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన వారిని అధికార పార్టీ నాయకులు ప్రశ్నించగా, సమాధానం దాటవేశారు.. పదేపదే ప్రశ్నిస్తే నేను టెన్త్ వరకే చదువుకున్నామని చెప్పడం విశేషం. మీ పేరేమిటి, చిరు నామా ఎక్కడ అని అడిగితే సమాధానం దాటవేశారు. వాళ్లు ఎవరు అని ఆరా తీస్తే తమిళనాడు ప్రాంతానికి చెందిన వలస కూలీలు అని అర్థమైంది. వారంతా కూడా ఏపీలోని ప్రాంతానికి వచ్చి వ్యవసాయ పనులు చేస్తున్నట్టు తెలుస్తోంది.. ప్రస్తుతం ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా, విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి.
ఇంత జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం.. అధికారంలో ఉన్నప్పటికీ వైసీపీ కూడా మౌనంగా ఉంటున్నది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇలా తమిళనాడు ఓటర్లతో ఓట్లు వేయించడం ఎప్పుడూ చూడలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.