https://oktelugu.com/

Afghanistan: తాలిబన్ల కబంధ హస్తాల్లోకి ‘అఫ్ఘనిస్తాన్’

అల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ను చంపేసి అప్ఘనిస్తాన్ లో ప్రజాస్వామ్యాన్ని స్థాపించిన అమెరికా తన సేనలను వెనక్కి తీసుకున్న వారాల్లోనే ఆ దేశం తిరిగి తాలిబన్ల చెరలోకి వెళ్లిపోయింది. ఇప్పటికే దేశంలోని మెజారిటీ భూభాగంపై పట్టు సాధించిన తాలిబన్లు ఆదివారం ఉదయానికి దేశ రాజధాని కాబుల్ కు సమీపంలో ఉన్న మరో నగరం జలాలాబాద్ ను సైతం ఆక్రమించారు. ప్రజలు నిద్రలేచేసరికి నగరవ్యాప్తంగా తాలిబన్ జెండాలు పెట్టేశారు.ప్రస్తుతం అప్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ కు […]

Written By:
  • NARESH
  • , Updated On : August 15, 2021 / 12:49 PM IST
    Follow us on

    అల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ను చంపేసి అప్ఘనిస్తాన్ లో ప్రజాస్వామ్యాన్ని స్థాపించిన అమెరికా తన సేనలను వెనక్కి తీసుకున్న వారాల్లోనే ఆ దేశం తిరిగి తాలిబన్ల చెరలోకి వెళ్లిపోయింది. ఇప్పటికే దేశంలోని మెజారిటీ భూభాగంపై పట్టు సాధించిన తాలిబన్లు ఆదివారం ఉదయానికి దేశ రాజధాని కాబుల్ కు సమీపంలో ఉన్న మరో నగరం జలాలాబాద్ ను సైతం ఆక్రమించారు. ప్రజలు నిద్రలేచేసరికి నగరవ్యాప్తంగా తాలిబన్ జెండాలు పెట్టేశారు.ప్రస్తుతం అప్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ కు అత్యంత సమీపంలో తాలిబన్లు ఉన్నారు.

    జలాలబాద్ ఆక్రమణతో ఇప్పుడు రాజధాని కాబుల్ కు తూర్పు ప్రాంతాలతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఏక్షణంలోనైనా తాలిబన్ ఉగ్రవాదులు దేశ రాజధానిలోకి ప్రవేశించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

    ఈ క్రమంలోనే అప్ఘానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ అప్ఘనీ ప్రభుత్వాన్ని తాలిబన్లకు అప్పగించాలా? వారితో భీకర యుద్ధం చేయాలా? అన్నదానిపై సమాలోచనలు చేస్తున్నారు. అయితే మరో రెండు రోజుల్లోనే అప్గానిస్తాన్ దేశం మొత్తం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

    శనివారం లోగర్ ప్రాంతాన్ని ఆక్రమించిన తాలిబన్లు.. మరో అతిపెద్ద రాష్ట్రం ముజార్ ఏ షరీఫ్ పైనా దాడి చేసి గెలిచారు. కాబుల్ కు ప్రస్తుం కేవలం 50 కి.మీల దూరంలో తాలిబన్లు పెద్ద సంఖ్యలో మోహరించి ఉన్నారు. ఏ క్షణమైనా రాజధాని కాబూల్ లో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి.

    కాగా అప్ఘనిస్తాన్ నుంచి తమ దేశ పౌరులు, సిబ్బందిని అమెరికా, కెనడా సహా అన్ని దేశాలు వెనక్కి పిలుపించుకుంటున్నాయి. దీంతో ఇక అప్ఘనిస్థాన్ తాలిబన్ల వశం అయినట్టే కనిపిస్తోంది.