Talibans : తాలిబ‌న్ల ఆదాయం ఎంత‌? ఎక్క‌డి నుంచి వ‌స్తోంది?

న‌లుగురు స‌భ్యులు ఉన్న ఒక ఇల్లు న‌డ‌వాలంటే స‌గ‌టున‌ క‌నీసం నెల‌కు 20 వేల రూపాయ‌లు కావాలి. మ‌రి ఒక వ్య‌వ‌స్థ‌నే న‌డిపించాలంటే..? ల‌క్ష‌లు దాటి కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్ర‌భుత్వానికైతే ప్ర‌జ‌లు క‌ట్టే ప‌న్నుల ద్వారా ఆదాయం స‌మ‌కూరుతుంది. మ‌రి, ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు ఎలా ఆదాయం వ‌స్తుంది? ఇర‌వై సంవ‌త్స‌రాలుగా అధికారానికి దూరంగా ఉండి, అమెరికా సైన్యాల‌ను ఎదుర్కుంటూ కాలం గ‌డిపారు తాలిబ‌న్లు. ఇంత‌కాలం వీరి పోష‌ణ ఎలా సాగింది? అస‌లు వీరికి డ‌బ్బులు […]

Written By: Bhaskar, Updated On : August 16, 2021 3:38 pm
Follow us on

న‌లుగురు స‌భ్యులు ఉన్న ఒక ఇల్లు న‌డ‌వాలంటే స‌గ‌టున‌ క‌నీసం నెల‌కు 20 వేల రూపాయ‌లు కావాలి. మ‌రి ఒక వ్య‌వ‌స్థ‌నే న‌డిపించాలంటే..? ల‌క్ష‌లు దాటి కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్ర‌భుత్వానికైతే ప్ర‌జ‌లు క‌ట్టే ప‌న్నుల ద్వారా ఆదాయం స‌మ‌కూరుతుంది. మ‌రి, ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు ఎలా ఆదాయం వ‌స్తుంది? ఇర‌వై సంవ‌త్స‌రాలుగా అధికారానికి దూరంగా ఉండి, అమెరికా సైన్యాల‌ను ఎదుర్కుంటూ కాలం గ‌డిపారు తాలిబ‌న్లు. ఇంత‌కాలం వీరి పోష‌ణ ఎలా సాగింది? అస‌లు వీరికి డ‌బ్బులు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయి? అన్న‌ది ఆస‌క్తిక‌ర‌మైన అంశం.

2001లో అమెరికాలోని వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్ పై విమానాల‌తో ఉగ్ర‌వాదులు దాడులు చేసిన త‌ర్వాత‌.. ఉగ్ర‌వాదాన్ని తుద‌ముట్టిస్తానంటూ అమెరికా సైన్యం బ‌య‌ల్దేరింది. ఆఫ్ఘ‌నిస్తాన్ కు వెళ్లి.. ఒక‌టీ రెండు కాదు, ఏకంగా 20 సంవ‌త్స‌రాలు పోరాటం చేసింది. అక్క‌డున్న ఆఫ్ఘ‌నిస్తాన్ సైన్యానికి శిక్ష‌ణ ఇచ్చి, వారితో క‌లిసి తాలిబ‌న్ల‌పై పోరాటం సాగించింది. ఈ క్ర‌మంలో ల‌క్ష‌ల మిలియ‌న్ల డాల‌ర్లు ఖ‌ర్చు చేసింది అమెరికా. వేలాది మంది సైనికుల‌ను పోగొట్టుకుంది. కానీ.. అనుకున్న‌ది సాధించ‌లేక‌పోయింది. ఉగ్ర‌వాదాన్ని నిర్మూలించ‌లేక‌.. ఒట్టి చేతుల‌తో తిరిగి వెళ్లిపోయారు అమెరికా సైనికులు.

అమెరికా సేన‌లు వెళ్లిపోవ‌డంతో.. ఆ దేశాన్ని తిరిగి త‌మ చేతుల్లోకి తీసుకునేందుకు ముందుకు క‌దిలారు తాలిబ‌న్లు. వారిని ఆప్ఘ‌నిస్తాన్ సైన్యం ఏ మాత్రం నిలువ‌రించ‌లేక‌పోయింది. ఒక్కో న‌గ‌రాన్ని స్వాధీనం చేసుకుంటూ రాజ‌ధాని కాబూల్ కు వ‌చ్చేశారు. నేడో రేపో అధికారాన్ని చేజిక్కించుకునే అవ‌కాశం కూడా క‌నిపిస్తోంది. మ‌రి, ఒక దేశ ప్ర‌భుత్వాన్ని, సైన్యాన్ని ఢీకొడుతూ.. మ‌నుగ‌డ సాగిస్తూ.. అధికారాన్ని కైవ‌సం చేసుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డానికి ఎంత ఆర్థిక శ‌క్తి కావాలి? అంత శ‌క్తి తాలిబ‌న్ల‌కు ఎలా వ‌చ్చింద‌ని అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. ఆ వివ‌రాలు చూద్దాం..

ప్ర‌పంచంలో సంప‌న్నుల వివ‌రాలు సేక‌రించే ప్ర‌ముఖ మేగ‌జైన్ ఫోర్బ్స్ 2016లోనే వీరి ఆదాయ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. వాటి ప్ర‌కారం.. ప్ర‌పంచంలోని టాప్ 10 ఉగ్ర‌వాద సంస్థ‌ల్లో తాలిబ‌న్లు ఐదో స్థానంలో ఉన్నారు. వీరి వార్షిక ఆదాయం రూ.2,900 కోట్లు. 2020లో నాటో విడుద‌ల చేసిన వివ‌రాల‌ను చూస్తే.. మైండ్ బ్లాక్ అవుతుంది. వీరి ఆదాయం ఏకంగా 11,829 కోట్ల‌కు పెరిగింది. మ‌రి, ఇంత డ‌బ్బు వారికి ఎలా వ‌స్తుంది అన్న‌ప్పుడు.. డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా, మైనింగ్ చేయ‌డం వీరి ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రులుగా ఉన్నాయి. వీటితోపాటు స్థానికంగా జ‌నాల నుంచి ప‌న్నులు వ‌సూలు చేయ‌డం, విదేశాల నుంచి విరాళాలు కూడా అందుకుంటున్నారు. అంతేకాదు.. వీరు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నారు. వీటి ద్వారా అంత మొత్తం సంపాదిస్తున్నారు.

అదే స‌మ‌యంలో ఆఫ్ఘ‌న్‌ ప్ర‌భుత్వం సైన్యానికి కేటాయిస్తున్న బ‌డ్జెట్ అంత‌కంత‌కూ త‌గ్గిపోయింది. కేవ‌లం రూ.800 కోట్లు మాత్ర‌మే అక్క‌డి స‌ర్కారు సైన్యానికి ఖ‌ర్చు చేసింది. మ‌రి, వేలాది కోట్ల ట‌ర్నోవ‌ర్ తో ఉగ్ర‌వాదుల‌ను పెంచుకుంటూ పోతున్న తాలిబ‌న్ల ముందు సైన్యం ఎలా నిల‌బ‌డుతుంది?