జీహెచ్ఎంసీలో సంపూర్ణ లాక్డౌన్.. క్లారిటీ ఇచ్చిన మంత్రి!

రాష్ట్రంలో కరోనా మహమ్మరి రోజురోజుకు విజృంభిస్తున్న సంగతి తెల్సిందే. గడిచిన పదిరోజులుగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. ఇందులో ఎక్కవుగా జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవుతున్నాయి. అయితే ఇటీవల రాష్ట్రంలో లాక్డౌన్లో భారీగా సడలింపులు ఇవ్వడంతో ఇతర జిల్లాల్లోనే కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. శుక్రవారం నాటికి తెలంగాణలో కేసుల సంఖ్య 4,484కు చేరింది. వీరిలో 449మంది విదేశీయులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు ఉన్నారు. వీరిలో 2,278మంది వైరస్ […]

Written By: Neelambaram, Updated On : June 13, 2020 3:15 pm
Follow us on


రాష్ట్రంలో కరోనా మహమ్మరి రోజురోజుకు విజృంభిస్తున్న సంగతి తెల్సిందే. గడిచిన పదిరోజులుగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. ఇందులో ఎక్కవుగా జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవుతున్నాయి. అయితే ఇటీవల రాష్ట్రంలో లాక్డౌన్లో భారీగా సడలింపులు ఇవ్వడంతో ఇతర జిల్లాల్లోనే కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. శుక్రవారం నాటికి తెలంగాణలో కేసుల సంఖ్య 4,484కు చేరింది. వీరిలో 449మంది విదేశీయులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు ఉన్నారు. వీరిలో 2,278మంది వైరస్ నుంచి కోలుకోగా 2,278మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇదిలా ఉంటే హైదరాబాద్ మహానగరంలో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మంత్రి తలసాని ఓ టీవీ ఛానల్లో జీహెచ్ఎంసీలో సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించనున్నారని చెప్పినట్లు న్యూస్ రావడంతో ఇది వైరల్ అయింది. రాష్ట్రంలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో తెలంగాణలో మరోసారి పూర్తిస్థాయిలో లాక్డౌన్ ఉంటుందని.. రెండు మూడు రోజుల్లో సీఎం కేసీఆర్ దీనిపై నిర్ణయం తీసుకోనున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వయంగా చెప్పినట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై మంత్రి తలసాని స్పందించారు.

రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ ఉంటుందని తాను చెప్పినట్లు ప్రచారం అవుతున్న వార్తలో నిజం లేదని చెప్పారు. సంపూర్ణ లాక్డౌన్ ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఇదిలా ఉంటే శుక్రవారం కూడా భారీగానే కేసులు నమోదయ్యాయి. కొత్తగా 164 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు సంఖ్య పెరుగుతుండటంతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో సంపూర్ణ లాక్డౌన్ అమలు చేయాలని నగరవాసులు కోరుతున్నారు. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రాల్లో కరోనా సహజీవనం అనే కొత్త స్లోగన్ నడుస్తుండటంతో రాష్ట్రంలో లాక్డౌన్ అమలు చేయకపోవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.