
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భావించినప్పటి నుంచి ప్రభుత్వమే బతుకమ్మ, దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. సీఎం కేసీఆర్ తెలంగాణలో అన్ని మతాలకు ప్రాధాన్యమిస్తూ ఆయా పండుగల్లో ఆయావర్గాల వారికి కానుకలను అందజేస్తున్నారు. ఇక తెలంగాణలో ఘనంగా నిర్వహించే బతుకమ్మను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి వేడుకలను నిర్వహిస్తుంది. ఈ పండుగను పురస్కరించుకొని ఆడపడుచులందరికీ బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనవాయితీగా వస్తోంది.
Also Read: కాంగ్రెస్ దెబ్బ.. డిఫెన్స్ లో టీఆర్ఎస్, ఎంఐఎం
బతుకమ్మ, దసరా పండుగ సమీపిస్తుండటంతో ప్రభుత్వం చీరల పంపిణీకి సన్నహాలు చేస్తోంది. ఈ ఏడాది 75లక్షల చీరలను ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. చీరలను తయారీని బయట కంపెనీలకు ఇవ్వకుండా సిరిసిల్ల చేనేత కార్మికులకు అప్పగించింది. సిరిసిల్లలోని 20వేల మరమగ్గాలపై 15వేల మంది కార్మికులు రాత్రింబవళ్లు చీరలను తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికే చీరల ప్రాసెసింగ్, ప్యాకింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది.
సిరిసిల్ల నేతన్నలు తయారు చేస్తున్న బతుకమ్మ చీరలను సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పలు సూచనలు చేస్తున్నారు. బంగారు, వెండి రంగుల్లో జరీతో కూడిన చీరలను ప్రభుత్వం తయారు చేయిస్తోంది. 225 వైరటీల్లో నాణ్యమైన, ఆకర్షణీయమైన రంగుల్లో చీరలు రూపొందుతున్నాయి. వీటిలో 10గజాల చీరలు 10లక్షలు ఉండగా.. మిగిలినవి 5.50మీటర్ల చీరె, 85సెం.మీ జాకెట్ వస్త్రాన్ని ఆడపడచుకులకు ప్రభుత్వం తరఫున అందించనుంది.
Also Read: సారూ… నోరిప్పండి!
నేతన్నలు తయారు చేసిన చీరలు ఇప్పటికే అన్ని జిల్లాలకు చేరాల్సి ఉంది. అయితే ఇటీవల ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రవాణాకు ఇబ్బందులు ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం సెప్టెంబరులో అన్ని జిల్లాలకు చీరలను పంపిణీ చేసేలా సన్నహాలు చేస్తుంది. రాష్ట్రంలో 18ఏళ్లు నిండి.. తెల్లరేషన్ కార్డు కలిగిన ఆడపచులందరికీ బతుకమ్మ చీరలను పంపిణీ ప్రభుత్వం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.