
కంచే చేనును మేసిన చందంగా మహిళలకు రక్షణగా ఉండాల్సిన స్వధార్ కేంద్రం వార్డెన్ సాయంతో అక్కడున్న యువతులపై లైంగిక వేధింపులకు సహకరించిన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే జిల్లాలోని రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు గ్రామంలో ఉన్న మహిళా ప్రాంగణంలో ఉన్న స్వధార్ కేంద్రంలో కొందరు యువతులు ఆశ్రయం పొందుతున్నారు. ఈ కేంద్రంలో వార్డెన్ గా పని చేస్తున్న వ్యక్తి సాయంతో వాచ్ మెన్ ఉంటున్న నలుగురు యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఆరోపణలపై నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హోం మేనేజర్ ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు.
సంఘటన సమాచారం తెలుసుకున్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత బొమ్మూరు స్వధార్ కేంద్రాన్ని సందర్శించారు. వేధింపులకు గురైన యువతులతో మాట్లాడి, వారికి ధైర్యం చెప్పారు. మహిళలను వేధింపులకు గురిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ దోషులను ఖఠినంగా శిక్షిస్తామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, మహిళలపై అరాచకాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందనన్నారు. బొమ్మూరు స్వధార్ హోమ్ లో ఎనిమిది మంది యువతులు ఆసరా పొందుతున్నారని, వీరిలో నలుగురుపై వాచ్‌మెన్ లైంగిక వేధింపులకు పాల్పడటంతో అతనని అరెస్టు చేయడం జరిగిందన్నారు. దీనిపై నిర్లక్ష్య వైఖరి చూపిన సంబంధిత వ్యక్తుల అధికారులపై తక్షణ చర్యలు చేపడతామన్నారు. అక్కడ ఉన్న యువతకులను వేరే చోటకు తరలిస్తామన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి రిపోర్టులు, విచారణ సమాచారం రాగానే ప్రభుత్వ సహకారాన్ని అందిస్తామని తెలిపారు. ఇటువంటి హోమ్‌ల వద్ద వాచ్‌మెన్‌ను స్త్రీలను నియమించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎంపీ మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ స్వధార్ హోమ్‌లో యువతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా న్యాయం జరుగుతుందని, మహిళలకు రక్షణ కోసం దిశ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. నిందితులకు కఠిన శిక్షలు తప్పవన్నారు.