సర్వే డెల్టా ప్లస్: అందరిపై ప్రభావం చూపుతుందటా?

కరోనా వైరస్ ప్రపంచాన్ని పరేషాన్ చేస్తోంది. కరోనా సోకిన వ్యక్తుల ప్రాణాలు పోయేంత ప్రమాదం పొంచి ఉంది. దీంతో వైరస్ బారిన పడి చాలా మంది తమ ప్రాణాలు కోల్పోయారు. కరోనా రెండు దశల్లో వైరస్ ధాటికి విలవిలలాడిపోయారు. మొదటి దశ కంటే రెండో దశ ప్రమాదకరంగా మారి ప్రజల్ని పలు ఇబ్బందుల పాలు చేసింది. ఇప్పటికే మూడో దశ ప్రమాదం పొంచి ఉందని శాస్ర్తవేత్తలు చెబుతున్నా ఎవరు కూడా జాగ్రత్తలు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో […]

Written By: Srinivas, Updated On : August 3, 2021 10:21 am
Follow us on

కరోనా వైరస్ ప్రపంచాన్ని పరేషాన్ చేస్తోంది. కరోనా సోకిన వ్యక్తుల ప్రాణాలు పోయేంత ప్రమాదం పొంచి ఉంది. దీంతో వైరస్ బారిన పడి చాలా మంది తమ ప్రాణాలు కోల్పోయారు. కరోనా రెండు దశల్లో వైరస్ ధాటికి విలవిలలాడిపోయారు. మొదటి దశ కంటే రెండో దశ ప్రమాదకరంగా మారి ప్రజల్ని పలు ఇబ్బందుల పాలు చేసింది. ఇప్పటికే మూడో దశ ప్రమాదం పొంచి ఉందని శాస్ర్తవేత్తలు చెబుతున్నా ఎవరు కూడా జాగ్రత్తలు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో టీకా వేసుకున్నా దాని ప్రభావం తీవ్రత తగ్గడం లేదని తెలుస్తోంది.

కరోనా సోకిన వ్యక్తుల్లో డెల్టా వేరియంట్ ఆందోళన సృష్టిస్తోంది. డెల్టా సోకిన వ్యక్తి అప్పటికే టీకా తీసుకున్నా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి స్థాయిలోనే వైరస్ వ్యాపిస్తోందని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీంతో మాస్కులు ధరించడం తప్పనిసరని సూచిస్తున్నారు. వైరస్ వ్యాప్తి చేయకుండా ఉండేందుకు నిబంధనలు పాటించాలని చెబుతున్నారు. మాస్క్ ధరించకపోతే ఇబ్బందులు వస్తాయని సీడీసీ డైరెక్టర్ రోషెల్ పీ వాలెన్ స్కీ పేర్కొన్నారు.

ఇక భారత్ లో పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయని సూచిస్తున్నారు. మాస్కులు ధరించాల్సిన ఆవశ్యకతను చెబుతున్నారు. డెల్టా వేరియంట్ ఉధృతి ప్రభావంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఏషియన్ సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ కు చెందిన డాక్టర్ తమోరిశ్ కోలె పేర్కొన్నారు. దీంతో టీకాలు వేసుకున్నా వేరియంట్లపై సమర్థంగా పనిచేస్తున్నాయని తెలిపారు. అందుకే అందరు విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నారు.

దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి పెరుగుతోంది. డెల్టా వేరియంట్ కూడా ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అనేక స్టేట్లు ఆంక్షలు సడలిస్తున్నాయి. దీంతో వైరస్ విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా పది స్టేట్లలో వైరస్ ఉధృతి వేగంగా పెరుగుతున్నట్లు తెలుస్లోంది. ఈ నేపథ్యంలో మూడో దశ వ్యాప్తిపై ఊహలు పెరుగుతున్నాయి. ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే పాటించాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే అవగాహన కలిపిస్తున్నారు.