అది శృంగారం అనిపించుకోదంటున్న కేరళ హైకోర్టు

ప్రజల హక్కులను కాపాడటంలో న్యాయస్థానాలు ఎల్లప్పుడు ముందుంటాయి. వంద దోషులు తప్పించుకున్న సరే.. ఒక నిర్దోషికి శిక్ష పడకూడదనే ప్రాథమిక సూత్రంతో న్యాయస్థానాలు పని చేస్తుంటాయి. దీంతో బాధితులకు ఒక్కోసారి చాలా ఆలస్యంగా జరుగుతుందనే విమర్శల పాలవుతూ ఉంటాయి. అయితే చివరి న్యాయమే గెలుస్తుందని న్యాయస్థానాలు ఎన్నోసార్లు నిరూపించాయి. తాజాగా కేరళ హైకోర్టు శృంగారానికి కొత్త నిర్వచనం చెప్పి బాధితులకు తగిన న్యాయం చేయడంపై అన్నివర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కోవిడ్-19పై పోరాటానికి ‘రోబో’ చేయూత 2009లో […]

Written By: Neelambaram, Updated On : October 26, 2023 4:47 pm
Follow us on


ప్రజల హక్కులను కాపాడటంలో న్యాయస్థానాలు ఎల్లప్పుడు ముందుంటాయి. వంద దోషులు తప్పించుకున్న సరే.. ఒక నిర్దోషికి శిక్ష పడకూడదనే ప్రాథమిక సూత్రంతో న్యాయస్థానాలు పని చేస్తుంటాయి. దీంతో బాధితులకు ఒక్కోసారి చాలా ఆలస్యంగా జరుగుతుందనే విమర్శల పాలవుతూ ఉంటాయి. అయితే చివరి న్యాయమే గెలుస్తుందని న్యాయస్థానాలు ఎన్నోసార్లు నిరూపించాయి. తాజాగా కేరళ హైకోర్టు శృంగారానికి కొత్త నిర్వచనం చెప్పి బాధితులకు తగిన న్యాయం చేయడంపై అన్నివర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

కోవిడ్-19పై పోరాటానికి ‘రోబో’ చేయూత

2009లో అత్యాచార కేసుకు సంబంధించి కేరళ హైకోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. మైనర్ బాలికను లోబర్చుకున్నడని నిందితుడికి శిక్ష ఖరారు చేస్తూ కింది కోర్టు అప్పట్లో తీర్పునిచ్చింది. 8వ త‌ర‌గ‌తి చదువుతున్న ఓ విద్యార్థిని అప్ప‌ట్లో టీవీ చూసేందుకు నిందితుడి ఇంటికి వెళ్లేది. దీనిని ఆసరా చేసుకొని నిందితుడు బాలికకు మాయ మాట‌లు చెప్పి లోబ‌ర్చుకోవడంతో బాలిక గ‌ర్భందాల్చింది. దీనిపై కోర్టు ఆ వ్యక్తిని అత్యాచార దోషిగా నిర్ధారించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు.

బాలిక అంగీకారంతోనే తమ మధ్య లైంగిక సంబంధం కొనసాగిందని నిందితుడు హైకోర్టులో వాదనలు విన్పించాడు. త‌న కోసం బాలిక అనేక మార్లు వ‌చ్చి వెళ్లేద‌ని వాదించాడు. నిందితుడి వాదనను హైకోర్టుల పరిణలోకి తీసుకోలేదు. ఈ సందర్భంగా హైకోర్టు శృంగారానికి సంచలన నిర్వచనం చెప్పింది. ఓ మహిళ పురుషుడికి లొంగిపోయినంత మాత్రాన శృంగారానికి అంగీకరించినట్టు కాదని స్ప‌ష్టం చేసింది. శారీరక సంబంధానికి స్త్రీ ‘ఆహ్వానం’ పలికితేనే ఆమె హక్కులకు భంగం కలుగలేదని భావించాలని వ్యాఖ్యానించింది.

జగన్ కు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి!

మైనర్ సమ్మతిని పరస్పర అంగీకారంతో శృంగారంగా భావించలేమని చెబుతూ కిందికోర్టు తీర్పును హైకోర్టు సమర్ధించింది. ఈ తీర్పు స్త్రీల హ‌క్కుల‌ను కాపాడేలా ఉండటంతో అన్నివర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయస్థానాలపై నమ్మకం, గౌరవం పెంచేలా కేరళ హైకోర్టు తీర్పు ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.