Homeజాతీయ వార్తలుCentral Election Commission- Supreme Court: ఎన్నికల సంఘం నిష్క్రియా పరత్వానికి కారణాలెన్నో?

Central Election Commission- Supreme Court: ఎన్నికల సంఘం నిష్క్రియా పరత్వానికి కారణాలెన్నో?

Central Election Commission- Supreme Court
Central Election Commission- Supreme Court

Central Election Commission- Supreme Court: ” ఎన్నికలు భారత ప్రజాస్వామ్యానికి మూలాధారం.. ఇవి ఎంత నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందో.. ఎన్నికల సంఘాన్ని పర్యవేక్షించేవారు కూడా అంతే నిష్పక్షపాతంగా ఉండాలి. ఇందులో ఆశ్రిత పక్షపాతం పనికిరాదు.. ప్రధాని, లోక్సభలో విపక్ష నేత, సుప్రీంకోర్టు జడ్జి తో కూడిన త్రిసభ్య కమిటీ సిఫారసుందరిపై కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి, ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమించాలి. కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి అణచివేతలను ఎదుర్కొంటూ ఎన్నికల ప్రక్రియ అనే బృహత్తర కార్యాన్ని నిర్వర్తించే ఎన్నికల సంఘం చేతుల్లోనే ప్రజాస్వామ్యం భవిష్యత్తు ఉంది. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య లక్ష్మణ రేఖ ఉండాలి..” ఇదీ సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ నియామకంపై వెలువరించిన తీర్పు.. న్యాయ వ్యవస్థ పరిస్థితి మీరి శాసన వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న ఆరోపణలకు పరోక్షంగానే ఆయినా… చాలా గట్టిగా జవాబు ఇచ్చింది.

వాస్తవానికి న్యాయవ్యవస్థ ముందు ఎన్నికల సంఘం ఇవాళ నిలబడింది కానీ.. ఒకప్పుడు శేషన్ ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం ఇలా ఉండేది కాదు. పూర్తి స్వయం ప్రతిపత్తితో వ్యవహరించేది.. కానీ కమిషనర్ల తీరుతో ఎన్నికల సంఘం ప్రాభవానికి దెబ్బ పడింది.

శేషన్ వచ్చేంతవరకూ..

వాస్తవానికి కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా శేషన్ వచ్చేంతవరకూ ఎవరూ దానికి ఉన్న విశేష అధికారాలు ఉపయోగించుకోలేదు.. వాస్తవానికి శేషన్ దేశం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న 1990 ల్లో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా బాధితుల స్వీకరించారు. ఆయన కేవలం ఆరు సంవత్సరాలు మాత్రమే పని చేసినప్పటికీ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఎన్నికల ప్రక్రియలో ఉన్న అవకతవకలను చక్కదిద్దారు.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి కొద్దో గొప్పో అమలవుతుందంటే దానికి కారణం శేషనే. అభ్యర్థుల వ్యయం పై పరిమితి, ఓటర్లకు గుర్తింపు కార్డులు, ఒక రాష్ట్రంలో జరిగే ఎన్నికలను ఇతర రాష్ట్రాల అధికారులు పరిశీలించడం ఆయన తెచ్చిన సంస్కరణలే. ఓటర్లకు తాయి లాలు ఇవ్వడం, మద్యం పంపిణీ చేయడం, ప్రార్థన మందిరంలో ప్రచారం చేయడం వంటి వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకున్నారు. అనుమతి లేకుండా భారీ మైకుల మోతను నిలిపివేశారు. ప్రచార రాతలతో గోడలు ఖరాబు కాకుండా అడ్డుకున్నారు. 40 వేలకు పైగా వ్యయ నివేదికలను ఆయన స్వయంగా పరిశీలించి తప్పుడు సమాచారం ఇచ్చిన 14,000 మంది అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించారు. ఎన్నికల నిబంధనలను పాటించినందుకు 1992లో బీహార్, పంజాబ్ ఎన్నికలను ఆయన రద్దు చేశారు. ఆయన కీలక సంస్కరణలు తెచ్చినప్పటికీ నియంతృత్వ శైలి రాజకీయంగా వివాదాస్పదమైంది. ఈయనను నియంత్రించేందుకు నాటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు పాలెం లో ఏకసభ్య ఎన్నికల కమిషన్ లో త్రిసభ్య ఎన్నికల కమిషన్ గా మార్చారు.

ఇక రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ అప్పట్లోనే ఎన్నికల కమిషన్ వ్యవహారంపై లోతుగా అధ్యయనం చేశారు.. రాజ్యాంగ సభలో దీనిపై చర్చించారు.. సీసీ అనర్హుడు అయితే పరిస్థితి ఏమిటన్న ఆలోచన తనకు తలనొప్పిగా పరిరమించిందని, 1949 జూన్ 16 న జరిగిన చర్చలో ఆయన పేర్కొన్నారు. ప్రతిపాదించిన సవరణ కారణంగానే ఎన్నికల ప్రధాన కమిషనర్, ఎన్నికల కమిషనర్లను పార్లమెంట్ చేసే చట్టం ద్వారా రాష్ట్రపతి నియమించాలని రాజ్యాంగంలోని 324 (2) అధికరణలో పొందుపరిచారు. వాస్తవానికి ఈ అధికరణ కారణంగానే కమిషనర్లను నియమించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి దఖలు పడింది. అయితే రిటైర్ అయిన సీనియర్ బ్యూరోక్రాట్లను కమిషనర్లుగా నియమిస్తుండడంతో ఈసీ నిష్పాక్షికత ప్రశ్నార్థకంగా మారుతున్నది. యూపీ హయంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ సారథ్యంలో రెండో పాలన సంస్కరణల కమిషన్ ఏర్పాటయింది. ఎన్నికల కమిషనర్లను ప్రధాన నేతృత్వంలోని కొలీజియం నియమించాలని సిఫారసు చేసింది. అందులో లోక్సభ స్పీకర్, లోక్సభలో ప్రతిపక్ష నేత, న్యాయ మంత్రి, రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ సభ్యులుగా ఉండాలని ప్రతిపాదించింది. అయితే అప్పటి బిజెపి పార్లమెంటరీ పార్టీ చైర్మన్ ఎల్కే అద్వానీ కూడా ఈ సూచనను సమర్థించారు.. తర్వాత ఇది అమలుకు నోచుకోలేదు.

Central Election Commission- Supreme Court
Central Election Commission- Supreme Court

ఇక ప్రస్తుత పరిస్థితుల్లో బిజెపికి అనుకూలంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అందుకు తగినట్టుగానే గత ఏడాది నవంబర్లో సీనియర్ బ్యూరోక్రాట్ అరుణ్ గోయల్ ను ఆగమేఘాలమీద మోడీ ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ గా నియమించిన తీరు వివాదాస్పదమైంది. మీరు డిసెంబర్ 31న ఆయన పదవీ విరమణ పొందాల్సి ఉండగా.. నవంబర్ 18న స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల కమిషనర్ గా ప్రభుత్వం నియమిస్తుంది తెలిసిన తర్వాతే ఆయన విఆర్ఎస్ కు దరఖాస్తు చేశారని, ప్రభుత్వం హడావిడిగా దానిని ఆమోదించిందని, రెండు రోజులకే ఆయన బాధ్యతలు చేపట్టారని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. అన్ని పార్టీలకు ఆమోదయోగ్యుడైన వ్యక్తి కమిషనర్ గా ఉండాలని స్పష్టం చేసింది. పార్లమెంటు చట్టం చేసేదాకా ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్సభలో విపక్ష నేతతో కూడిన ప్యానెల్ సలహాతో రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్లను నియమించాలని తాజాగా రూలింగ్ ఇచ్చింది. ఇది ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాశంగా మారింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version