Celebrity Reaction Street Dogs: సుప్రీంకోర్టు తీర్పు ఒక్కటే దేశంలో పెద్ద డ్రామాకు కారణమైపోయింది. తీర్పు ఏమంటుందో కూడా చదవకుండానే కొందరు సెలబ్రిటీలు “ఓహ్ మై గాడ్… డాగీ లవర్స్, రైజ్ అండ్ ప్రొటెస్ట్!” మోడ్‌లోకి వెళ్లిపోయారు. తీర్పు ఏమిటంటే? ఢిల్లీ NCR పరిధిలో వీధి కుక్కలను సురక్షితంగా ప్రత్యేక షెల్టర్లలో ఉంచండి. రోడ్ల మీద తిరగనివ్వకండి. అంతే! కానీ వీరి రియాక్షన్ చూస్తే, సుప్రీంకోర్టు “ఇవన్నీ ఎగుమతి చేసి మంగళగ్రహానికి పంపించాలి” అన్నట్లుంది.
సెలబ్రిటీ కన్నీరు – స్పెషల్ ఎడిషన్
ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, ట్విట్టర్ థ్రెడ్స్, ఫోటోషూట్‌లతో కుక్కల పట్ల తమ “దయ”ని ఎగుమతి చేస్తూ ఉన్నారు. ఎవరో ఒకరు కాఫీ మగ్ పట్టుకుని, పక్కన ఫ్లఫీ కుక్కతో “స్టాప్ కేనైన్ క్రైమ్” అని హ్యాష్‌ట్యాగ్… మరొకరు బ్లాక్ అండ్ వైట్ సెల్ఫీతో “డాగ్స్ ఆర్ పీపుల్ టూ” అంటూ పోస్ట్… ఇంకొకరు ఏకంగా “రేపిస్టుల్ని వదిలేస్తారు, కుక్కల్ని మాత్రం…” అనే హ్యాష్‌ట్యాగ్ వేసి రివల్యూషనరీగా ఫీల్ అవుతున్నారు.
Also Read: ‘బిగ్ బాస్ 9’ అగ్ని పరీక్ష ప్రోమో అదిరిపోయింది..ఊహించని ట్విస్టులు ఇచ్చారుగా!
-గ్రౌండ్ రియాలిటీ?
ఇళ్లలో పెంచుకునే కుక్కలకే ఈ స్థాయి జాగ్రత్తలు ఉంటే, వీధికుక్కల పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. పిల్లల్ని స్కూల్‌కు పంపేటప్పుడు, ఉదయం జాగింగ్‌కి వెళ్లేటప్పుడు, లేదా పేపర్ తీసుకురావడానికి బయటకు వస్తే, ఒక్కసారిగా “బౌ… బౌ… బౌ…” అంటూ 6 మంది గుంపుగా చుట్టేస్తే వచ్చే ఫీల్‌కి ఈ స్మైల్-పోస్ట్స్‌లో చోటు ఎక్కడ?
-సుప్రీంకోర్టు వేసిన సింపుల్ ప్రశ్న
“రోడ్డుపై కుక్కలకు ఆహారం పెడితే ఎందుకు ఇంటికి తీసుకెళ్లి పెట్టరని?” ఈ ప్రశ్న విన్న వెంటనే చాలామంది సెలబ్రెటీల నోటి వెంట మాట రాదు.. “ఓ… ఆ… మా ఇంట్లో స్పేస్ లేదు”.. “మేము లవ్ చేస్తాం కానీ హ్యాండిల్ చేయలేం” అంటారు. ఇంకొందరు “ఫ్లాట్స్‌లో పెట్స్ ఆలౌడ్ కాదు” ఇలా సమాధానమిస్తారు. మొత్తానికి వీరందరికీ కుక్కల మీద ప్రేమ ఉంది, కానీ రిమోట్ కంట్రోల్ ప్రేమ.. దూరం నుంచే ఫీల్ అవ్వాలి.
ఈ డాగ్-డ్రామా చూస్తుంటే, వీధికుక్కల సమస్య కన్నా వీధి సెలబ్రిటీల సమస్య ఎక్కువగా ఉంది అనిపిస్తుంది. కుక్కల్ని నిజంగా ప్రేమిస్తే? ఒక్కొక్కరు నాలుగు కుక్కలు దత్తత తీసుకుంటే NCRలోని సమస్య సాల్వ్ అయిపోతుంది. కానీ అలా చేయటానికి ఎవరికీ టైమ్ లేదు. కుక్కల కోసం కన్నీరు కార్చటానికి మాత్రం టైమ్ కేటాయిస్తారు… ఎందుకంటే అది కెమెరా ఫ్రెండ్లీ కాబట్టి!
View this post on Instagram