https://oktelugu.com/

టీఆర్ఎస్ నేత కోసం బీజేపీ ఎదురుచూపు?

కేంద్రంలోని బీజేపీకి ఉత్తరాది పార్టీ అనే పేరుంది. ఈ ముద్రను చెరిపేసేందుకు దక్షిణాది రాష్ట్రాల వైపు ఎప్పటి నుంచో చూస్తూనే ఉంది. దక్షిణాదిలోని కర్ణాటక మినహా ఎప్పుడూ సొంతంగా పార్టీ అధికారంలోకి వచ్చిన దాఖలులేవు. ఇటీవల బీజేపీ వరుసగా రెండుసార్లు కేంద్రంలోకి అధికారంలో రావడంతో ఈ అవకాశాన్ని బీజేపీ సద్వినియోగం చేసుకుంటోంది. దక్షిణాదిలోనూ బీజేపీ బలపడేందుకు యత్నిస్తుంది. Also Read: కేసీఆర్ కు సరైన ప్రత్యర్థి అతడేనా? ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాలపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 24, 2020 / 01:32 PM IST
    Follow us on

    కేంద్రంలోని బీజేపీకి ఉత్తరాది పార్టీ అనే పేరుంది. ఈ ముద్రను చెరిపేసేందుకు దక్షిణాది రాష్ట్రాల వైపు ఎప్పటి నుంచో చూస్తూనే ఉంది. దక్షిణాదిలోని కర్ణాటక మినహా ఎప్పుడూ సొంతంగా పార్టీ అధికారంలోకి వచ్చిన దాఖలులేవు. ఇటీవల బీజేపీ వరుసగా రెండుసార్లు కేంద్రంలోకి అధికారంలో రావడంతో ఈ అవకాశాన్ని బీజేపీ సద్వినియోగం చేసుకుంటోంది. దక్షిణాదిలోనూ బీజేపీ బలపడేందుకు యత్నిస్తుంది.

    Also Read: కేసీఆర్ కు సరైన ప్రత్యర్థి అతడేనా?

    ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాలపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. కిందటి ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలుపొందింది. ఏపీలో మాత్రం ఒక్కసీటు గెలుచుకోలేకపోయినా కేంద్రంలో బీజేపీ ఉండటంతో బీజేపీ నాయకులు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు. ఇక తెలంగాణలో బీజేపీ బలపడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉండటంతో అధిష్టానం ఇటూవైపు ఫోకస్ పెట్టింది. టీఆర్ఎస్ కంచుకోటైన కరీంనగర్ నుంచి ఎంపీగా గెలుపొందిన బండి సంజయ్ కుమార్ కు బీజేపీ అధిష్టానం తెలంగాణ అధ్యక్ష పదవీని కట్టబెట్టింది. యువతలో బండి సంజయ్ కుమార్ కు మంచి పేరుండటంతో ఆయనకు ఆ పదవీ దక్కినట్లు తెలుస్తోంది.

    బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకం తర్వాత ఆ పార్టీ నేతల్లో జోష్ పెరిగింది. అధికార టీఆర్ఎస్ పై బీజేపీ నేతలు దూకుడుగా వెళుతున్నారు. కేంద్ర మంత్రులు తెలంగాణ బీజేపీ నేతలకు పూర్తి మద్దతు ఇస్తున్నారు. దీంతో తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తుంది. అయితే బీజేపీ అధిష్టానం ఓ టీఆర్ఎస్ నేతను తమవైపు ప్రయత్నిస్తోంది. గతంలోనూ సదరు నేత బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే ఏమైందో ఏమోగానీ ఆ నేత చివరి నిమిషంలో బీజేపీకి హ్యండిచ్చినట్లు తెలుస్తోంది.

    Also Read: కేసీఆర్‌లో దూకుడు తగ్గడానికి అదే కారణమా?

    టీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత అంతటి బలమైన నేతగా ఉన్న హరీష్ రావును బీజేపీ గాలంవేస్తోంది. కిందటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత సీఎం కేసీఆర్ కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. కొంతకాలం హరీష్ రావుకు మంత్రి పదవీ ఇవ్వలేదు. అప్పటి నుంచి బీజేపీ అధిష్టానం హరీష్ రావుతో టచ్లో ఉందనే ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత కేసీఆర్ హరీష్ రావుకు ఆర్థిక మంత్రి పదవీ కట్టబెట్టారు. దీంతో హరీష్ రావు టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు. దీంతో బీజేపీ ఆశలు నెరవేరలేదు.

    బీజేపీ పెద్దలు మాత్రం హరీష్ రావు ఎప్పుడొచ్చినా బంపర్ ఆఫర్ ఇస్తామంటూ ఆయనకు సంకేతాలు పంపుతున్నారు. అయితే హరీష్ రావు ఇప్పట్లో టీఆర్ఎస్ ను వీడే పరిస్థితులు మాత్రం ఎక్కడా కన్పించడం లేదు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని నానుడి బలంగా ఉండటంతో బీజేపీ నేతలు హరీష్ రావు రాకకోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మరీ బీజేపీ ఆశలు ఫలిస్తాయో లేదో వేచి చూడాల్సిందే..!